July 10, 2026

కామెడీ స్టార్ రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష.. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

కామెడీ స్టార్ రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష.. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
Reading Time: 2 minutes

కామెడీ స్టార్ రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష.. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

Caption of Image.

బాలీవుడ్ కామెడీ స్టార్ రాజ్ పాల్ యాదవ్ కు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. దాదాపు రూ. 9 కోట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ఆయనకు విధించిన జైలు శిక్షను కోర్టు సమర్థించింది.  జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్  రాజ్ పాల్ యాదవ్ కు 3 నెలల పాటు సాధారణ జైలు శిక్షను ఖరారు చేస్తూ ఈ రోజు ( జూల్ 10, 2026 ) కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

అసలేం జరిగిందంటే?

గతంలో రాజ్ పాల్ యాదవ్ తన స్వీయ దర్శకత్వంలో ‘ అతా పతా లాపాత’ మూవీ కోసం మురళీ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి భారీగా అప్పు తీసుకున్నారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీప్ వద్ద ఘోర పరాజయం పాలుకావడంతో ఆయన భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో అప్పుతీర్చడానికి రాజ్ పాల్ ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. దీనిపై బాధితులు ఆయనపై ఏడు వేర్వేరు క్రిమినల్ కేసులు వేశారు.

 అటు 2018 నాటి మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును, 2019 నాటి సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ యాదవ్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. డబ్బులు తిరిగి చెల్లిస్తానని కోర్టుకు ఇచ్చిన హామీలను రాజ్‌పాల్ పదే పదే ఉల్లంఘించడంతో న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 2026 లో ఆయన కొద్దిరోజులు తిహార్ జైలులో కూడా గడిపారు.

భారీ జరిమానా.. 

మరోసారి ఈ కేసుల పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు, రాజ్‌పాల్ యాదవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్లను కొట్టేసింది. ప్రతి కేసులోనూ రూ. కోటికి పైగా మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఆయన ఇప్పటికే చెల్లించిన సుమారు రూ. 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ తుది చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నారు. 

ALSO READ : హీరోగా ఛాన్స్ ఇస్తానని రూ. 3.5 కోట్ల చీటింగ్..

ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు,తదుపరి లీగల్ ప్రాసెస్ కోసం రాజ్‌పాల్ యాదవ్‌కు హైకోర్టు రెండు నెలల సమయాన్ని మంజూరు చేసింది. ఈ గడువులోగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించకపోతే మిగిలిన జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. వెండితెరపై అందరినీ నవ్వించిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. నిజ జీవితంలో మాత్రం ఇలాంటి సీరియస్ లీగల్ ఇబ్బందుల్లో చిక్కుకోవడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 

©️ VIL Media Pvt Ltd.