Jaanvi Swarup: మహేష్ బాబు మేనకోడలు లేటెస్ట్ ఫొటోస్ చూశారా? ట్రెండీ దుస్తుల్లో మతిపోగోడుతున్న జాన్వీ
సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆ ఫ్యామిలీ నుంచి మూడో తరం రెడీ అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తుండగా ఆయన కూతురు సితార ఘట్టమనేని ఇప్పటికే యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది.
ఇక గౌతమ్ కూడా తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. అతను ఇప్పటికే మహేష్ నటించిన వన్.. నేనొక్కడినే సినిమాలో కనిపించాడు.
ఇక కృష్ణ సోదరుడు, దివంగత రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను హీరోగా నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక వీరితో పాటు మహేష్ బాబు మేనకోడలు, మంజుల గారాల పట్టి జాన్వీ స్వరూప్ కూడా త్వరలోనే కెమెరా ముందుకు రానుంది. ఆమె తెరంగేట్రం గురించి ఇప్పటికే మంజులనే స్వయంగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయి.
కాగా సినిమాల కంటే ముందు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతోంది జాన్వీ. తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. తాజాగా మరికొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది జాన్వీ.
ఈ ఫొటోల్లో లైట్ ఎల్లో కలర్ క్రాప్ ట్యాంక్ టాప్, దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ జోగర్ ప్యాంట్స్ ధరించి ట్రెండీగా మెరిసిపోయింది జాన్వీ. మరీ ముఖ్యంగా ఆమె టాప్ పై ఉన్న ‘అవుట్ ఆఫ్ మై మైండ్ ప్లీజ్ లీవ్ ఎ మెసేజ్’ అనే స్లోగన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం జాన్వీ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు జాన్వీ లుక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా నేచురల్‌గా, హీరోయిన్ మెటీరియల్‌లా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా గతంలోనే ఓ సినిమాలో నటించింది జాన్వీ. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్న పాత్రలో మెరిసింది జాన్వీ.





