July 9, 2026

ISRO: భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో మరో కీలక విజయం

ISRO: భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో మరో కీలక విజయం
Reading Time: 2 minutes
ISRO: భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో మరో కీలక విజయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో-ISRO) ఇది కేవలం ఓ సంస్థ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఎంటో చూపే బలమైన శక్తి. గత పదేళ్లుగా ఇస్రో చేసిన ప్రయోగాలు.. కేవలం భారత్ ప్రయోజనాల కోసమే కాదు.. ప్రపంచ దేశాల కోసం ఎన్నో కీలక ప్రయోగాలను చేసి సత్తా చాటింది. త్వరలో గగన్ యాన్ ప్రాజెక్టు చేపట్టేందుకు గత ఐదేళ్లుగా శ్రమిస్తోంది. సొంత టెక్నాలజీతో ఇందులోని వివిధ దశలను పూర్తి చేస్తూ వస్తోంది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయన్.. నెక్ట్స్ గగన్ యాన్.. భారత్ చేస్తున్న తొలిమ్యాన్ మిషన్ పనులు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం ఎన్నో ప్రయోగాత్మక ప్రయోగాలు చేపట్టాల్సి ఉంది. భారత్ చేపడుతున్న మ్యాన్ మిషన్‌లో మరో టెస్ట్ లాంచ్ సక్సెస్ చేసింది ఇస్రో.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్ యాన్ వన్ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయాన్ అంతకు మించిన ఎఫర్ట్‌తో ఇస్రో చేస్తున్న ప్రయోగం గగన్ యాన్. భారత్ చేస్తున్న తొలి మ్యాన్ మిషన్ కావడంతో ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసలు ప్రయోగానికి ముందుగా జరిగే ప్రయోగాత్మక ప్రయోగాలను ఒకటికి రెండు సార్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖపట్నం, గుజరాత్, తమిళనాడులో కీలకమైన ప్రయోగాలను గగన్ యాన్ కోసం ముందస్తు పరీక్షలను చేపట్టారు. బెంగళూరు నుంచి గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూ మాడ్యూల్‌ను శ్రీహరికోటకు తరలించారు. అయితే ఏడాదిలో రోదశిలోకి వ్యోమగాములను పంపి తిరిగి సురక్షితంగా భూమి పైకి తెచ్చే గగన్ యాన్ ..1 మ్యాన్ మిషన్ ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తుంది.

అందులో భాగంగానే అక్టోబర్ మూడవ వారంలో గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టంగా పిలవబడే ఒక ప్రయోగాత్మక ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇస్రో ఈ గగన్ యాన్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు రకాల పరీక్షలు విజయవంతంగా నిర్వహించి తమ సామర్థ్యాన్ని నిరూపించారు. ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు గగన్ యాన్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ప్రయోగాత్మక ప్రయోగంగా మరో విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్ ప్రాంతంలో ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ జరిగింది.

ఈ క్రూ మాడ్యూల్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టి అక్కడ ఏడు రోజులు తరువాత తిరిగి భూమి మీదకు సురక్షితంగా దింపేలా ప్లాన్ చేశారు. అయితే ఇలా నాలుగు పర్యాయాలు గగన్‌యాన్ ట్రైల్ లాంచ్ ప్రయోగాలు చేపట్టిన తర్వాత గగన్ యాన్ రాకెట్.. మానవ సహిత మాన్ మిషన్ ప్రయోగం చేపట్టనుంది. వ్యోమగాములను రోదసీ నుంచి తిరిగి భూమి మీదకు సురక్షితంగా తీసుకురావడమే ఇస్రో ప్రధాన లక్ష్యం. గతంలో విశాఖ, గుజరాత్‌లో కూడా కొన్ని పరీక్షలను సక్సెస్ చేసింది ఇస్రో. ఇస్రో చేపడుతున్న ఈ మ్యాన్ మిషన్ శ్రీహరికోట నుంచే జరుగుతుండగా ప్రపంచ వ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. ఇంకా కొన్ని ప్రయోగాత్మక పరీక్షల తర్వాత త్వరలోనే గగన్ యాన్ ప్రయోగం జరగనుంది.