Reading Time: < 1 minute
Jana Nayagan Movie Censor Completed A Certificate Release Date

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ అభిమానులు ఎంతో కాలంగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎన్నో వివాదాలు, మరెన్నో అడ్డంకులను అధిగమించి, ఆయన తాజా చిత్రం జననాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ ఫార్మాలిటీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాల ప్రకారం సినిమా నిడివి (183.11 నిమిషాలు (అంటే దాదాపు 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్) ఉండనుంది.

హెచ్. వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇష్యూస్, లీకేజీల వంటి పలు సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, సెన్సార్ బోర్డు సూచించిన మార్పులన్నింటినీ పూర్తి చేసి, జూలై 9, 2026 నాటి అధికారిక క్లియరెన్స్‌తో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత విడుదలవుతున్న సినిమా, ఆయన కెరీర్ లో చివరి సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. థియేటర్లలో మాస్ విస్ఫోటనాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.