July 9, 2026

Gold Rate Today: గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Gold Rate Today: గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Reading Time: 2 minutes
Gold Rate Today: గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

భారతీయుల జీవితాల్లో బంగారానిది ప్రత్యేక స్థానం. ఎన్నో తరాలుగా వారి జీవితాల్లో ఇదొక భాగంగా మారింది. పండగొచ్చిన, వేడుకైన బంగారం కొనాల్సిందే. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా మార్కెట్లో కనిపిస్తున్న స్వల్ప ఊరట పసిడి ప్రేమికుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు గురువారం కూడా మరికొంత తగ్గాయి. గత రెండు రోజులుగా మార్కెట్‌లో పసిడి ధరల గ్రాఫ్‌ను పరిశీలిస్తే, కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. జూలై 8వ తేదీన భారీగా తగ్గిన ధరలు, ఇవాళ కూడా అదే ఒరవడిని కొనసాగించాయి. బుధవారం 24 క్యారెట్ల బంగారం ఏకంగా 2130 తగ్గి తులం బంగారం 1,43,130కు చేరుకోగా.. గురువారం స్వల్పంగా రూ.10 తగ్గి రూ.1,43,120 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటికి ఇవాళ్టికి తులానికి రూ.10 తగ్గింది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం బుధవారం 1950 తగ్గి రూ.1,31,200కు చేరగా.. ఇవాళ మరో రూ.10 తగ్గి రూ.1,31,190 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల బంగారం రూ.1,07,340గా నమోదైంది. అటు విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు

భారతదేశంలోని వివిధ నగరాల్లో పన్నులు, రవాణా ఛార్జీల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,540 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,32,490గా నమోదైంది. ఇక18 క్యారెట్ల తులం గోల్డ్ రూ.1,10,690గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,43,270గా ఉండగా.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగా రూ.1,31,340గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ.1,43,120గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,31,190గా నమోదైంది.

వెండి ధరలు ఇలా

బంగారంతో పాటే హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధరలు కూడా సామాన్యులకు భారీ ఊరటనిస్తున్నాయి. బుధవారం ఏకంగా రూ.5,000 మేర భారీగా పతనమైన కిలో వెండి ధర.. ఇవాళల కూడా అదే బాటలో పయనించి మరో రూ.100 తగ్గింది. దీంతో ప్రస్తుతం భాగ్యనగరంలో ఒక గ్రాము వెండి ధర రూ.244.90 కి చేరగా, కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ముంబై, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్‌లోనూ ఇదే విధమైన ధరలు నమోదు కాగా, ఢిల్లీలో మాత్రం కిలో వెండి రూ.2,45,100 వద్ద కాస్త ఎక్కువగా ఉంది.

కొనుగోలుదారులకు అనుకూల సమయమా?

భారతీయ కుటుంబాలలో ప్రతి చిన్న సేవింగ్స్‌ను బంగారం రూపంలో దాచుకోవడం ఒక ఆనవాయితీ. ఆర్థిక సంక్షోభ సమయాల్లోనూ, కష్టాల్లోనూ ఆదుకునే నమ్మకమైన సాధనం బంగారం మాత్రమే అని భారతీయుల నమ్మకం. గత రెండు రోజులుగా ధరలు భారీగా పెరగకుండా స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గుముఖం పట్టడం అనేది రాబోయే రోజుల్లో శుభకార్యాల కోసం ప్లాన్ చేసుకునే వారికి, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కాస్త ఊరటనిచ్చే విషయమేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.