వరంగల్ కమిషనరేట్ పరిధిలో 862 కేజీల గంజాయి దహనం

గ్రేటర్వరంగల్, వెలుగు: వరంగల్పోలీస్కమిషనరేట్ పరిధిలో గురువారం 862 కేజీల గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అంకిత్ కుమార్ సంక్వార్ మాట్లాడుతూ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 86 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు రూ.4.31 కోట్ల విలువైన 862 కేజీల గంజాయిని హన్మకొండ జిల్లా అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద దహనం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రభాకర్‌రావు, పి.డేవిడ్ రాజు, ఏసీపీ సీసీఆర్‌బీ, ఇన్‌స్పెక్టర్లు సంజీవరావు, ఎస్ఐ నరేశ్, పోలీసులు పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో 67కేజీలు..
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని వివిధ పోలీస్స్టేసన్ల పరిధిలో నమోదు చేసిన ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 67.013 కేజీల ఎండు గంజాయిని పోలీసులు గురువారం దహనం చేశారు. ఈగల్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు సుమారు రూ.33.50 లక్షల విలువైన 67.013 కేజీల ఎండు గంజాయిని డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, మంగపేట ఎస్సై టీవీకే సూరి, డీసీఆర్బీ ఎస్సై వెంకటేశ్, పోలీస్ బృందం వరంగల్ కాకతీయ మెడి వేస్ట్ యూనిట్‌లో దహనం చేశారు.