NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

దేశంలో ఆరోగ్య సేవలను మరింత అందుబాటు ధరల్లో ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే 39 కీలక ఔషధాల చిల్లర ధరలను (Retail Prices) అధికారికంగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, కంటి సమస్యలు తదితర చికిత్సలకు ఉపయోగించే అనేక మందులు నిర్ణీత ధరలకే అందుబాటులోకి రానున్నాయి.
39 కీలక మందులకు కొత్త ధరలు
ఎన్‌పీపీఏ నిర్ణయించిన మందుల్లో అధిక రక్తపోటు (Hypertension), మధుమేహం (Diabetes), కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, కంటి వ్యాధులు, విటమిన్-డి లోపం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే ఔషధాలు ఉన్నాయి.
ఈ మందులు చౌకగా మారాయి
సంఖ్య- ఔషధం పేరు (ఫార్ములేషన్/బ్రాండ్) – చిల్లర ధర (రూ.)
1 అమ్లోడిపైన్, టెల్మిసార్టన్, మెటోప్రోలోల్ సక్సినేట్ (ఎక్స్‌టెండెడ్ రిలీజ్) టాబ్లెట్ 12.03
2 అమోక్సిసిలిన్, క్లావులనేట్ పొటాషియం డిస్పర్సిబుల్ టాబ్లెట్ 27.31
3 అమోక్సిసిలిన్, పొటాషియం క్లోబులనేట్ టాబ్లెట్ 19.53
4 ఆస్పిరిన్ (గ్యాస్ట్రో-రెసిస్టెంట్), అటోర్వాస్టాటిన్ క్యాప్సూల్స్ 3.67
5 ఆస్పిరిన్, అటోర్వాస్టాటిన్, క్లోపిడోగ్రెల్ క్యాప్సూల్స్ 8.86
6 అటోర్వాస్టాటిన్, ఎజెటిమిబ్ మాత్రలు 31.73
7 అటోర్వాస్టాటిన్, ఎజెటిమిబ్ టాబ్లెట్ 21.36
8 అటోర్వాస్టాటిన్, క్లోపిడోగ్రెల్ టాబ్లెట్ 14.87
9 అటోర్వాస్టాటిన్, క్లోపిడోగ్రెల్ టాబ్లెట్ 15.01
10 బిసోప్రోలోల్ ఫ్యూమరేట్, టెల్మిసార్టన్ టాబ్లెట్ 12.71
11 విసోప్రోలోల్ ఫ్యూమరేట్, టెల్మిసార్టన్ టాబ్లెట్ 10.83
12 సెటిరిజైన్ హైడ్రోక్లోరైడ్ డ్రాప్స్ 8.55
13 క్లోబాజామ్ ఓరల్ సస్పెన్షన్ 2.8
14 డాపగ్లిఫ్లోజిన్, టెల్మిసార్టన్ టాబ్లెట్ 19.3
15 ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ (ER) టాబ్లెట్ 14.88
16 ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ (ER) టాబ్లెట్ 17.17
17 నెబిబోలోల్ హైడ్రోక్లోరైడ్, ఆమ్లోడిపైన్ టాబ్లెట్ 13.72
18 ఓల్మెసార్టన్ మెడాక్సోమిల్, ఆమ్లోడిపైన్ టాబ్లెట్ 14.8
19 ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్ఫెనిరమైన్ మాలియేట్, బోరిక్ ఆమ్లం, హైడ్రాక్సీప్రొపైల్ మిథైల్ సెల్యులోజ్ కంటి చుక్కలు 8.35
20 పోల్మాకోక్సిబ్, పారాసెటమాల్ టాబ్లెట్ 11.79
21 టెల్మిసార్టన్, క్లోర్థాలిడోన్ మాత్రలు 13.03
22 టెల్మిసార్టన్, క్లోర్థాలిడోన్ మాత్రలు 21.4
23 టెల్మిసార్టన్, క్లోర్థాలిడోన్ మాత్రలు 11.8
24 టెల్మిసార్టన్, సిల్నిడిపైన్ టాబ్లెట్ 13.24
25 టెల్మిసార్టన్, సిల్నిడిపైన్, క్లోర్థాలిడోన్ మాత్రలు 16.17
26 టోరసెమైడ్, స్పిరోనోలాక్టోన్ టాబ్లెట్ 3.71
27 ట్రిప్సిన్-కైమోట్రిప్సిన్, ఏక్లోఫెనాక్, పారాసెటమాల్ టాబ్లెట్ 13.02
28 విటమిన్ డి ఓరల్ సొల్యూషన్ 15.88
29 టెనెక్టెప్లేస్ (TNK-tPA) ఇంజెక్షన్ 60238.27
30 నెటాసుండిల్, లాటానోప్రోస్ట్ ఆప్తాల్మిక్ ద్రావణం 362.57
31 ఇమాటినివ్ ఓరల్ సొల్యూషన్ 59.61
32 అమ్లోడిపైన్, బిసోప్రోలోల్, టెల్మిసార్టన్ మాత్రలు 12.81
33 అమ్లోడిపైన్, బిసోప్రోలోల్, టెల్మిసార్టన్ మాత్రలు 14.74
34 నెపాఫెనాక్, మోక్సిఫ్లోక్సాసిన్ నేత్ర సంబంధిత ద్రావణం 68.64
35 డారునావిర్, రిటోనావిర్, డోలుటెగ్రావిర్ మాత్రల కాంబి కిట్ 330.4
36 క్లోపిడోగ్రెల్, ఆస్పిరిన్, అటోర్వాస్టాటిన్ క్యాప్సూల్స్ 6.37
37 గ్లిమెపిరైడ్, వోగ్లిబోస్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ (SR) టాబ్లెట్ 8.85
38 సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, గ్లిమెపిరైడ్ మాత్రలు 13.27
39 సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, గ్లిమెపిరైడ్ మాత్రలు 11.75
కంపెనీలకు కఠినమైన సూచనలు
ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఈ మందులను నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు అమ్మకూడదని NPPA స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులోని ముఖ్యమైన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ధరల ప్రదర్శన: చిల్లర వ్యాపారులు, పంపిణీదారులు అందరూ తమ దుకాణంలో ధరల పట్టికను ప్రముఖమైన ప్రదేశంలో ప్రదర్శించాలి.
నిబంధనల ఉల్లంఘన: ఒక కంపెనీ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే, నిత్యావసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం ఆ అదనపు మొత్తాన్ని వడ్డీతో పాటు ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది.
కొత్త ఔషధాల నియమాలు: ఈ ఔషధాలను కొత్తగా మార్కెట్లోకి తీసుకురావాలనుకునే కంపెనీలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలను పాటించాల్సి ఉంటుంది.