July 10, 2026

2029 జూన్ లోనే అసెంబ్లీ ఎన్నికలు.. 117 సీట్లు గెలుస్తాం..ఆ భద్రాద్రి రాముడిపై ఆన: సీఎం రేవంత్

2029 జూన్ లోనే అసెంబ్లీ ఎన్నికలు.. 117  సీట్లు గెలుస్తాం..ఆ భద్రాద్రి రాముడిపై ఆన: సీఎం రేవంత్
Reading Time: < 1 minute

2029 జూన్ లోనే అసెంబ్లీ ఎన్నికలు.. 117 సీట్లు గెలుస్తాం..ఆ భద్రాద్రి రాముడిపై ఆన: సీఎం రేవంత్

Caption of Image.

తెలంగాణలో  వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్ లోనే జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి .ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన..డీ లిమిటేషన్ బిల్లును ఆమోదించుకునేందుకు కేంద్రం విపక్షాలను పిలుస్తుందన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో 15 పార్లమెంట్ సీట్లు 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి పెరుగుతాయని స్పష్టం చేశారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 117కు పైగా స్థానాలు గెలుచుకుని, రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇది ఖమ్మం ప్రజల మాట.. ఆ భద్రాచలం రాముడి మీద ఆన అంటూ సీఎం రేవంత్  బీఆర్ఎస్ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. 

ALSO READ : కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం

బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు రాక్షస పాలన సాగిందని మండిపడ్డ  సీఎం రేవంత్ .. గత కేసీఆర్ మాయమాటలను నమ్మకుండా 2023లో ప్రజలు అద్భుతం సృష్టించారని, కేసీఆర్‌ను ఎక్కడికి పంపాలో అక్కడికే పంపించారని ఎద్దేవా చేశారు. తాను బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌లో చేరినప్పుడు జనం ఉప్పెనాలా తరలివచ్చారని గుర్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 65 సీట్లు వస్తాయని తాను లెక్కలతో సహా చెబితే.. కొందరు నవ్వారని, కానీ అదే నిజమై చూపించామన్నారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండుసున్నా చుట్టించామని,  బైపోల్స్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన సత్తా చాటుకుంటూనే ఉందన్నారు.

©️ VIL Media Pvt Ltd.