Aadhaar Card: ఆధార్ కార్డులో కొత్త అప్‌డేట్.. డిసెంబర్ 31 వరకు అవకాశం..!

Aadhaar Card: ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డు అనేది కీలకమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఇది లేనిది ఏ పనులు జరగని పరిస్థితి నెలకొంది. ఏ చిన్న పనికైనా ఆధార్ తప్పకుండా కావాలిల్సిందే. అయితే ఆధార్‌పై కీలక మార్పులను తీసుకువస్తోంది కేంద్రం. ఒకప్పుడు ఆధార్‌లో ఏదైనా అప్‌డేట్ చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది. ఆన్‌లైన్ సెంటర్లు, మీ సేవా సెంటర్ల వద్ద తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ మొబైల్‌లోనే అన్ని పనులు చేసుకునే వెసులుబాటు తీసుకువస్తోంది కేంద్రం.
తాజాగా మరో కీలక అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు ఆధార్ కార్డు వినియోగదారులకు ఒక ముఖ్యమైన శుభవార్త. మీ ఆధార్ కార్డుకు జీమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవడం లేదా కొత్తగా లింక్ చేసుకోవడం ఇప్పుడు పూర్తిగా ఉచితం. ఈ సదుపాయం 2026 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ సేవకు రూ.75 రుసుము ఉంటుంది. అయితే ప్రస్తుతం దానిని రద్దు చేశారు. మీరు మీ ఆధార్ కార్డుకు జీమెయిల్ ఐడీని ఎప్పుడూ లింక్ చేయకపోతే లేదా మీ పాత ఈమెయిల్ ఐడీ నిరుపయోగంగా ఉంటే, ఇది అప్‌డేట్ చేయడానికి సరైన సమయం. మీ ప్రస్తుత జీమెయిల్ ఖాతాలో ఆధార్ సంబంధిత అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌లను పొందడానికి ఈ అప్‌డేట్ చాలా అవసరం.
ఈ ప్రక్రియ చాలా సులభం, కేవలం ఒక నిమిషం పడుతుంది. మీరు అధికారిక ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో మీ 12 అంకెల ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPతో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్ యాడ్ లేదా అప్‌డేట్ ఎంపికను ఎంచుకోండి. మీ కొత్త జీమెయిల్ చిరునామాను ఎంటర్ చేసి, వివరాలను ధృవీకరించండి. అభ్యర్థనను సబ్మిట్ చేసిన తర్వాత, సుమారు 15 రోజుల్లో మీ ఈమెయిల్ అప్‌డేట్ అవుతుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైలెక్కే ముందు ఎందులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మీ మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు.. టికెట్ పొందడానికి సూపర్ ట్రిక్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి