July 10, 2026

PNB Scheme: ఇంటి నిర్మాణానికి రూ.40 లక్షల వరకు రుణం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త పథకం!

PNB Scheme: ఇంటి నిర్మాణానికి రూ.40 లక్షల వరకు రుణం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త పథకం!
Reading Time: 2 minutes
PNB Scheme: ఇంటి నిర్మాణానికి రూ.40 లక్షల వరకు రుణం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త పథకం!

PNB New Scheme: భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న అర్హులైన దరఖాస్తుదారులకు గృహ రుణాలు పొందేందుకు వీలుగా “ట్రైబల్ ప్లస్ లోన్ స్కీమ్” అనే ప్రత్యేక రుణ సదుపాయాన్ని ప్రారంభించింది. తనఖా, భూ యాజమాన్యంలో ఉన్న పరిమితుల కారణంగా సరైన బ్యాంకింగ్ సౌకర్యాలను పొందడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది.

అయితే ఈ పథకాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ గౌహతి, రాయ్‌పూర్ జోన్‌ల పరిధిలోని గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆ ప్రాంత ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి వారికి తగిన ఆర్థిక పరిష్కారాలను అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద, అర్హులైన నెలసరి జీతభత్యాలు పొందుతున్నవారు. వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్నవారు నివాస గృహాలు, ఫ్లాట్‌ల కొనుగోలు, నిర్మాణం, మరమ్మత్తు లేదా విస్తరణ కోసం రూ. 40 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Water Tank Level: వాటర్ ట్యాంక్ నిండిందా? ఫోన్‌లోనే లైవ్ స్టేటస్.. నీళ్లు వృథా కాకుండా మోటారును ఆపే సూపర్ డివైజ్!

పీఎన్‌బీ ట్రైబల్ ప్లస్ రుణ పథకం ముఖ్య లక్షణాలు:

  • దరఖాస్తు: నివాస గృహాలు, ఫ్లాట్ల కొనుగోలు, నిర్మాణం, మరమ్మత్తు, పునరుద్ధరణ, విస్తరణ కోసం ఆర్థిక సహాయం.
  • రుణ మొత్తం: అర్హులైన నెలసరి జీతం పొందుతున్న వారికి రూ. 1 లక్ష నుండి రూ. 40 లక్షల వరకు రుణాలు, వృత్తి నిపుణులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రూ. 25 లక్షల వరకు.
  • తిరిగి చెల్లించే కాలపరిమితి: 15 సంవత్సరాల వరకు.
  • వడ్డీ రేటు: దరఖాస్తుదారుడి విద్యార్హత, క్రెడిట్ స్కోర్ ఆధారంగా పోటీతత్వ వడ్డీ రేట్లు.
  • అర్హత ప్రమాణాలు: నెలసరి జీతం పొందుతున్న వారు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి సవరించిన అర్హత ప్రమాణాలు ఉంటాయి.

సాంప్రదాయ పద్ధతిలో ఆస్తులను తాకట్టు పెట్టడం కష్టంగా ఉండే గిరిజన ప్రాంతాలలో గృహ రుణాలను సులభతరం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాలలోని ఎంపిక చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖల ద్వారా రుణాన్ని పొందవచ్చు.

ఈ పథకంపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సుబోధ్ కుమార్ వ్యాఖ్యానిస్తూ, “పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్లప్పుడూ వినూత్నమైన, డిమాండ్‌కు అనుగుణమైన బ్యాంకింగ్ సేవల ద్వారా దేశంలోని వెనుకబడిన ప్రాంతాలకు అధికారిక ఆర్థిక సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. గిరిజన ప్రాంతాల నివాసితులు గృహ రుణాలను పొందడంలో ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడానికి ‘పీఎన్‌బీ ట్రైబల్ ప్లస్ లోన్ స్కీమ్’ను రూపొందించడం జరిగింది అని అన్నారు. ఈ చొరవ ద్వారా గిరిజన ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి మద్దతు ఇవ్వడం, అధికారిక బ్యాంక్ రుణాలను సులభతరం చేయడం, తద్వారా ఈ ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని, ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడం మా లక్ష్యం అని అన్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఇక నుంచి టికెట్‌ను స్క్రీన్‌షాట్‌, వాట్సాప్‌లో చూపించలేరు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి