July 10, 2026

B. V. Nandini Reddy: జాక్‌పాట్ కొట్టిన నందినిరెడ్డి..ఈసారి బాలీవుడ్ పై గురి!

B. V. Nandini Reddy: జాక్‌పాట్ కొట్టిన నందినిరెడ్డి..ఈసారి బాలీవుడ్ పై గురి!
Reading Time: < 1 minute
B. V. Nandini Reddy: జాక్‌పాట్ కొట్టిన నందినిరెడ్డి..ఈసారి బాలీవుడ్ పై గురి!

మా ఇంటి బంగారం సినిమాతో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టింది డైరెక్టర్ నందినీ రెడ్డి. ఏకంగా 80 కోట్ల డైరెక్టర్‌గా నామ్ కమాయించింది. ఎట్ ప్రజెంట్ ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూనే తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్ పై వర్క్ కూడా చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే నందినీ రెడ్డికి జాక్ పాట్ లాంటి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్‌తో మన లేడీ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్‌కే తన ట్యాలెంట్ చూపించనుంది. మా ఇంటి బంగారం సినిమాకి నందినీ రెడ్డి రాజ్‌ నిడమోరుతో కలిసి పని చేసింది. కథ కథనాలు రాజ్ అందిచినప్పటికీ తన డైరెక్షన్‌తో సినిమాకు మంచి అవుట్ పుట్ ఇచ్చింది నందినీ రెడ్డి. ఇదే ఇప్పుడు రాజ్‌ను ఇంప్రెస్ అయ్యేలా చేసింది. దీంతో రాజ్‌, నందినీ రెడ్డితో కలిసి తొందర్లో ఓ బాలీవుడ్ మూవీని చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో నందినీ రెడ్డి తొందర్లో బాలీవుడ్ బాట పట్టనున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇక నందినీ రెడ్డి కూడా బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చదువుకున్న రోజుల్లో తాను ఢిల్లీలో రెండు సంవత్సరాలు ఉన్నానని.. అప్పుడు హిందీ సినిమాలు చాలా బాగా చేసేదాన్నని నందినీ రెడ్డి అన్నారు. మంచి కథ దొరికితే హిందీలో కూడా సినిమా చేస్తానంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో రాజ్‌తో నందినీ రెడ్డి బాలీవుడ్ సినిమా చేయడం పక్కా అనే కామెంట్ ఇప్పుడు నెట్టింట కూడా గట్టిగా వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lenin Review: అయ్యగారి ప్రోగ్రెస్ కార్డ్ ! లెనిన్ హిట్టా.. ఫట్టా..?