మిడిల్ ఈస్ట్‌లో ముదిరిన వార్.. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా దాడులు..!

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరుదేశాలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటుండంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసిందని ఆరోపించింది. గురువారం (జులై 9) మధ్యాహ్నం ఈ దాడులు జరిగాయని ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA)
తెలిపింది. ఈ దాడిలో అణు విద్యుత్ కేంద్రానికి ఏదైనా ప్రమాదం జరిగిందా..? ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. అయితే, అమెరికా మాత్రం ఈ దాడులను ధృవీకరించలేదు.
బుషెహర్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా సహాయంతో ఇరాన్ అభివృద్ధి చేసింది. ఇది ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2025లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఈ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దళాలు దాడులు చేశాయి. పదే పదే బుషెహర్ అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు:
ఇరాన్, అమెరికా మధ్య సీజ్ ఫైర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ ముగిసింది.. ఇక మిగిలింది దాడులే.. ఇరాన్‌పై ఈ రాత్రికే భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్‌లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు చేసి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు.
ఇరాన్ దాడులను మేం ఖండిస్తున్నాం. ఇరాన్ దాడులతో తాత్కాలిక ఒప్పందన్ని ఉల్లంఘించింది. అలా చేయడం ఇరానియన్ల తప్పు.. ఇరాన్ తో ఒప్పందంలో ముఖ్య అంశమే అణు కార్యక్రమాలు నిలిపివేయడం.. లేకపోతే ఆ పని మేమే చేస్తామమంటూ వార్నింగ్ హెచ్చరించారు.
ఫిబ్రవరి చివరలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఉద్రిక్తత వ్యూహాత్మక నౌకా రవాణా మార్గం హార్ముజ్ ఘర్షణలకు సెంటర్ పాయింట్‌గా మిగిలిపోయింది.ఈ జలమార్గంపై నియంత్రణ కొనసాగించాలని టెహ్రాన్ పట్టుబడుతోంది. నౌకల రాకపోకలపై ఫీజులు వసూలు చేస్తామని లేకుంటే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల మూడు నౌకలపై దాడి చేయడంతో మంగళవారం ఇరాన్‌పై అమెరికా దాడులుచేసింది. ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది.