July 9, 2026

అపస్మారక స్థితిలో ఉన్న కోతికి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.. వీడియో వైరల్ 

అపస్మారక స్థితిలో ఉన్న కోతికి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.. వీడియో వైరల్ 
Reading Time: < 1 minute

అపస్మారక స్థితిలో ఉన్న కోతికి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.. వీడియో వైరల్ 

Caption of Image.

ఏమైందో ఏమో.. ఓ కోతి సడెన్ గా రోడ్డుపై పడిపోయింది.. అపాస్మారకస్థితిలోకి వెళ్లింది. చూస్తున్న వారంతా చనిపోయిందని అనుకున్నారు.కానీ ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు.  అయితే ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రం మానవత్వంతో దగ్గరికి వెళ్లి చూసి బతికి ఉందని తెలిసి కాపాడే ప్రయత్నం చేశారు. మనుషులకు చేసినట్లుగానే ఆ కోతికి సీపీఆర్ చేశారు. దాదాపు మూడు నిమిషాల పాటు శ్రమించినందుకు ఫలితం దక్కింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతి లేచి కూర్చుంది. సాధారణంగా పరుగులు పెట్టింది.ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.  ఎక్కడ జరిగిందో స్పష్టత లేదుగానీ.. ఆ ఇద్దరు మానవత్వం గల మనుషులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఇద్దరి మానవత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.  మాటలు చెప్పలేని మూగజీవికి సమయానికి సహాయం చేయడం నిజమైన మానవత్వం.. వారి చొరవ వల్లే ఆ కోతి ప్రాణాలతో బయటపడింది అంటూ ప్రశంసలు కురిపించారు.  సరైన సమయంలో స్పందించి ఓ మూగజీవికి జీవం పోసిన ఆ ఇద్దరి చర్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.