Mixed Talk Movies : మిక్స్‌డ్ టాక్‌తో వందల కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చిన సినిమాలు

కొన్ని సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్ల ఊచకోత కోస్తుంటే ఇంకొన్ని డివైడ్ టాక్‌తో స్లోగా ఆడియన్స్‌ను థియేటర్స్ వైపుకు తెప్పిస్తుంటాయి. ఈ మధ్య బాలీవుడ్‌లో ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. మై వాపస్ ఆవూంగా నుండి వెల్కమ్ టు ది జంగిల్ వరకు వన్ టైం వాచబుల్ మూవీస్సే అన్నారు కానీ థియేటర్స్‌లో నిలబడి కోట్లు కుమ్మరించుకుంటున్నాయి. సూర్య హీరోగా వచ్చిన కరుప్పు తొలి రోజు మిక్స్ టాక్ తెచ్చుకుంది. కానీ కట్ చేస్తే రూ. 350కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఈ ఏడాది తమిళ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది.
ఇంతియాజ్ అలీ మై వాపస్ ఆవూంగా ఆడియన్స్ తొలుత పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ మెల్లిగా పుంజుకుని లాంగ్ రన్‌లో రూ. 55 కోట్లు నెట్ వసూళ్లను సాధించింది. స్లీపర్ హిట్‌గా నిలిచింది. జులై 19న వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ కాక్ టైల్2 వారం థియేటర్స్ దగ్గర నిలబడం కష్టం అనుకుంటే టూ వీక్స్ కంప్లీట్ చేసుకుని ధర్డ్ వీక్‌లోకి అడుగుపెట్టింది. మిక్డ్స్ టాక్ తో ఈ సినిమా రూ. 100 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టుకుంది. మల్టీస్టారర్ మూవీ వెల్కమ్ టు ది జంగిల్ అయితే క్రింజ్ మూవీ అంటూ కొట్టిపారేశారు. అక్షయ్ కుమార్ భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్లు నెట్ రూ. 160 గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసి భూత్ బంగ్లా తర్వాత ఫోర్త్ హయ్యెస్ట్ బాలీవుడ్ గ్రాసర్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా అవతరించింది. మిక్స్ టాక్ వచ్చినా సినిమాలు ఆడటం కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నా సమ్మర్‌లో సరైన సినిమాలు లేకపోవడంతో పాటు రిలీజైన మూవీస్ బోర్ కొట్టిస్తుండటంతో మరో ఆప్షన్ లేక ఉన్న వాటిలో బెటర్ ఫిల్మ్ వీక్షిస్తున్నారన్నది క్రిటిక్స్ వాదన.