July 10, 2026

గచ్చిబౌలిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం.. యాక్టివాను ఢీకొట్టడంతో.. హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తున్న యువతి మృతి

గచ్చిబౌలిలో  వాటర్ ట్యాంకర్ బీభత్సం.. యాక్టివాను ఢీకొట్టడంతో.. హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తున్న యువతి మృతి
Reading Time: < 1 minute

గచ్చిబౌలిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం.. యాక్టివాను ఢీకొట్టడంతో.. హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తున్న యువతి మృతి

Caption of Image.

హైదరాబాద్ గచ్చిబౌలిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న యువతులను ఢీకొట్టడంతో  పెద్ద ప్రమాదం జరిగింది. హాస్టల్ లో ఉంటూ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న యువతులలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం (జులై 10) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద జరిగింది ఈ ఘోర ప్రమాదం. వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి యాక్టివాపై వెళ్తున్న  యువతులపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గచ్చిబౌలిలోని హాస్టల్ లో ఉంటూ సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న  మల్లం భవాని(23) స్పాట్ లోనే చనిపోయింది. ఆమె స్నేహితురాలు సుభాషిని (30) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. భవాని, ఆమె స్నేహితురులా సుభాషిని అంజయ్య నగర్ లోని హాస్టల్ లో ఉంటున్నారు.  గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ నుండి అంజయ్య నగర్ కు యాక్టీవ పై వెళ్తున్న  క్రమంలో ప్రమాదం జరిగింది. 

గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న యాక్టివా స్కూటీని  వెనక నుంచి వేగంగా వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మల్లం భవాని అక్కడికక్కడే మృతి చెందగా సుభాషినికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

©️ VIL Media Pvt Ltd.