రూ.10ల కాయిన్స్ తో వచ్చాడు..షోరూం బైక్ తీసుకొని వెళ్లాడు..వీడియో వైరల్

మనం సాధారణంగా బైక్ గానీ, కారు గానీ కొనుగోలు చేయాలంటే ఏం చేస్తాం.. ఫస్ట్ థింక్ గా వెహికల్ లోన్ తీసుకుంటాం..లేదంటే డబ్బులు ఉన్నోళ్లు అయితే బ్యాంక్ అకౌంట్ ద్వారాగానీ,చెక్ ల ద్వారాగానీ పేమెంట్ చేస్తుంటాం.. అదీకాదు.. లిక్విడ్ క్యాష్ చేతిలో ఉంటే వందనోట్లతోనో, ఐదు వందల నోట్లో చెల్లిస్తాం.. కానీ ఈయనేం చేశాడో చూడండి.. పది రూపాయల కాయిన్లు.. అక్షరాల లక్షా 10వేల విలువైన కాయిన్స్ ను బస్తాల్లో తెచ్చి షోరూం బైక్ కొనుక్కున్నాడు.. వినడానికి వింతగా ఉంది కదా. పదిరూపాయల కాయిన్స్ టేబుల్ పై పోసి లెక్కిస్తున్న దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం వింత అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఈ వింత ఘటన జరిగింది ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే..యాదాద్రి భువనగిరి జిల్లాలో చిట్యాలలో.. చిట్యాల మండలం వెలిమినేడు కు చెందిన ఓ వ్యక్తి ఇలా కాయిన్స్ తో బైక్ కొని షోరూం మేనేజర్ తో పాటు నెటిజన్లను అశ్చర్యపర్చాడు.
వెలిమినేడుకు చెందిన కొండె రఘపతి చిట్యాలలోని శ్రీ వినాయక మోటార్స్ లో స్ప్లెండర్ ప్లస్ బైక్ కొనుగోలు చేశాడు. ఇతను క్యాష్ పేమెంట్ చేయాలనుకున్నాడు. చాలా రోజులుగా కూడబెడుతున్న పది రూపాయల కాయిన్స్ ను బైక్ కొనుగోలుకు వినియోగించాడు. ఓ బస్తాలో పదిరూపాయల కాయిన్స్ తీసుకొచ్చి మేనేజర్ టేబుల్ పై పోసి లెక్కబెడుతున్న దృశ్యాలు పక్కన ఉన్నోళ్లో సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.
ఇక ఈవీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెట్టారు. రఘుపతి వింత ఆలోచనకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బైక్ విలువ లక్షా పదివేలు అంటే మొత్తం 11 వేల పది రూపాయల కాయిన్స్ ను కూడబెట్టాడు రఘుపతి. అన్ని కాయిన్స్ కూడబెట్టడం వెనక రఘుపతి కృషిని అభినందింస్తున్నారు.
VIDEO | A man from Telangana’s Yadadri-Bhuvanagiri district grabbed attention by purchasing a bike after paying the entire amount of Rs 1.10 lakh in Rs 10 coins.
Konde Raghupathi, a resident of Veliminedu village in Chityala mandal, bought a Splendor Plus motorcycle from Sri… pic.twitter.com/OY7gN0jajD
— Press Trust of India (@PTI_News) July 8, 2026