Reading Time: < 1 minute

కరీంనగర్ జిల్లాలో దారుణం… అప్పు తీర్చలేదని తల్లిదండ్రులను గెంటేసిన కొడుకు … ఊళ్ళో బిక్షాటన చేస్తూ..!

Caption of Image.

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు ఓ కొడుకు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… హుజురాబాద్ లో వృద్ధ తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు ఓ కొడుకు. అప్పు తీర్చలేదన్న కారణంతో తమను ఇంటి నుంచి గెంటేసాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

ఈ క్రమంలో ఆత్మహత్యకు సిద్దమైన వృద్ధ దంపతులకు హుజురాబాద్ జనం అండగా నిలిచారు. దమ్మక్కపేటలో వృద్ధ దంపతులకు ఆశ్రయం కల్పించారు స్థానికులు. బతుకుదెరువు కోసం ఇంటింటికీ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు వృద్ధ దంపతులు. దృశ్యాలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి.

జీవిత చరమాంకంలో ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని… కన్న తల్లిదండ్రులను గెంటేసిన కొడుకుకు బుద్ధి చెప్పాలని… వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు స్థానికులు.

©️ VIL Media Pvt Ltd.