July 9, 2026

Lucky Zodiacs: ఈ రాశులకు గజకేసరి యోగం..అనేక రకాలుగా అదృష్టాలు గ్యారంటీ..!

Lucky Zodiacs: ఈ రాశులకు గజకేసరి యోగం..అనేక రకాలుగా అదృష్టాలు గ్యారంటీ..!
Reading Time: 2 minutes
Lucky Zodiacs: ఈ రాశులకు గజకేసరి యోగం..అనేక రకాలుగా అదృష్టాలు గ్యారంటీ..!

చంద్రుడికి సంబంధించిన గజకేసరి యోగం, చంద్ర మంగళ యోగం ఎప్పుడు ఎక్కడ పట్టినా కొందరు జాతకుల జీవితాలు సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ యోగాలు నెలకొకసారైనా పట్టడం జరుగుతుంది. ప్రస్తుతం జూలై 14, 15, 16 తేదీల్లో కర్కాటక రాశిలు గురు, చంద్రుల యుతి జరిగి గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా వెలుగులు నింపుతుంది. కర్కాటక రాశి చంద్రుడికి స్వక్షేత్రం, గురువుకు ఉచ్ఛ క్షేత్రం అయినందు వల్ల ఈ యోగం రెట్టింపు శుభ ఫలితాలనిస్తుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులు ఈ యోగం వల్ల బాగా లబ్ధి పొందడం జరుగుతుంది..

  1. మేషం: జూలై నెల 14, 15, 16 తేదీల్లో ఈ రాశివారు చేపట్టే ప్రయత్నాలన్నీ నూరు శాతం విజయవంతం అవుతాయి. ఈ రాశికి చతుర్థ స్థానంలో పడుతున్న గజకేసరి యోగం వల్ల ఉద్యోగంలోతప్పకుండా ఉన్నత పదవి లభిస్తుంది. ఈ మూడు రోజుల తర్వాత నుంచి వీరికి మహర్దశ పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. రాబడి అంచనాలకు మించి వృద్ధి చెందు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి జూలై ద్వితీయార్థం నుంచి దశ తిరగడం ప్రారంభం అవుతుంది. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ప్రభుత్వపరంగా కూడా ఊహించని గుర్తింపు లభిస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారు లకు మీ సలహాలు, సూచనలు లాభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశిలో రాశ్యధిపతి చంద్రుడు, ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు యుతి చెందుతుండడం వల్ల వీరి జీవితం అనేక విధాలుగా సానుకూల మలుపులు తిరుగుతుంది. సామాన్య వ్యక్తి సైతం సంపన్ను డయ్యే అవకాశం ఉంది. ఆశించిన విదేశీ అవకాశాలు అందుతాయి. కుటుంబంలో ఆదాయవృద్ధితో పాటు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు ఊహించని విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో చంద్రుడు కలవడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశివారికి అపారంగా ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. రాజయోగాలు, ధన యోగాలు పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురో గతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవు తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.
  5. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు చంద్రుల యుతి జరగడం వల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. షేర్లు, స్పెక్యులే షన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఉద్యో గంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం తప్ప తగ్గడం ఉండదు. పిత్రార్జితం లభిస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కూడా బాగాకలిసి వస్తుంది.
  6. మీనం: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండి పంచమ స్థానంలో పంచమాధిపతి చంద్రుడితో కలవడం వల్ల తప్పకుండా అపారమైన ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి జూలై ద్వితీయార్థం నుంచి తప్ప కుండా దశ తిరుగుతుంది. ఆదాయం అంచనాలకు మించి పెరగడంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో అంచ నాలకు మించిన పురోగతి ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

Also Read: శని వక్ర గమనం.. త్వరలో ఈ రాశులకు గోల్డెన్ డేస్.. మీ జాతకం మారుతోంది భయ్యా..!