Reading Time: < 1 minute
Shresta Iyer Opens Up About Online Trolling Abuse And Threats

Shresta Iyer: టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో తనపై జరిగిన ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఐపీఎల్ సందర్భంగా వైరల్ అయిన ఓ వీడియో అనంతరం తనకు తీవ్రమైన విమర్శలు, వ్యక్తిగత దూషణలు ఎదురయ్యాయని తెలిపారు. తన రూపం, వ్యక్తిత్వం, శరీరాకృతిపై అసభ్య వ్యాఖ్యలు చేయడమే కాకుండా అత్యాచార బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె వెల్లడించారు. అనంతరం తాను పనిచేస్తున్న సంస్థను సైతం కొందరు లక్ష్యంగా చేసుకున్నారని, సహోద్యోగులకు తెల్లవారుజామున ఫోన్ చేసి వేధించారని చెప్పారు.

ఈ ప్రతికూల అనుభవాలే తన సోదరుడు శ్రేయస్ అయ్యర్ సోషల్ మీడియాలో దూరంగా ఉండటానికి ఒక కారణమని శ్రేష్ఠ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆమె పరోక్షంగా సూచించారు. కాగా, ఐపీఎల్ సమయంలో శ్రేష్ఠకు సంబంధించిన ఒక వీడియో చాలా వివాదానికి కారణమైంది.. అంతే కాదు విపరీతంగా ట్రోల్ చేయబడింది.. ఆ వివాదం గురించి ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన శ్రేష్ఠ.. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే నాకు ప్రాణ బెదిరింపులు రావడం కూడా మొదలైందని.. నాకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. నా రూపం గురించి రకరకాలుగా మాట్లాడారు. నా వ్యక్తిత్వం గురించి అభ్యంతరంగా మాట్లాడారు… నా శరీరం గురించి కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు.. ఈ విషయాలు మీ మనస్తత్వాన్ని వెల్లడిస్తాయని శ్రేష్ఠ అన్నారు.