July 9, 2026

జ్యోతిష్యం:2026 జులై 10 యోగిని ఏకాదశి చాలా పవర్ ఫుల్ .. ఏ రాశి వారు ఏం చేయాలి..

జ్యోతిష్యం:2026 జులై 10 యోగిని ఏకాదశి చాలా పవర్ ఫుల్  .. ఏ రాశి వారు ఏం  చేయాలి..
Reading Time: 2 minutes

జ్యోతిష్యం:2026 జులై 10 యోగిని ఏకాదశి చాలా పవర్ ఫుల్ .. ఏ రాశి వారు ఏం చేయాలి..

Caption of Image.

హిందూ ఆచారాల ప్రకారం… జపాలు.. దానాలు వంటి వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.  ఇబ్బందులు వచ్చినా.. ఆర్థిక కష్టాలు.. ఆరోగ్య సమస్యలు..ఇలా ఏ సమస్య వచ్చినా పండితులను సంప్రదిస్తారు.  జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి.. దోషాలను.. వాటి పరిహారాలను చెబుతారు.  అయితే గత జన్మల్లో చేసిన పాప పుణ్యాల ఫలితాలను ప్రస్తుత జన్మలో కర్మఫలితాలను అనుభవిస్తారు.  అలాంటి దోషాలు తొలగిపోయేందుకు.. జీవితంలో పడే ఇబ్బందులను తొలగడానికి రాశి ప్రకారం కొన్ని వస్తువులు దానం చేయాలి. జ్యేష్ఠమాసం.. కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు.  ఆరోజున ( 2026  జులై 10) చేసే దానాలకు 88 వేల రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.  మరి ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

పురాణాల ప్రకారం ఏకాదశి పూజ.. దానాలకు చాలా విశిష్టత ఉంది.  మామూలు రోజుల్లో చేసిన దానాల కంటే ఆ రోజు చేసిన దానాలకు 88 వేల రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు.  ఈ పవిత్రమైన రోజున మీ రాశికి అనుగుణంగా ఏ వస్తువును దానం చేయాలో, ఏ దానం చేస్తే శ్రీమన్నారాయణుడి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం… 12 రాశులకు నవగ్రహాలు అధి దేవతలుగా ఉంటారు.  ప్రతి  రాశి వారు ఒక ప్రత్యేక వస్తువులను దానం చేస్తే ఆ  గ్రహాల వలన కలిగే  దోషాలకు ఉపశమనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

ఏ రాశి వారు ఏమి దానం చేయాలంటే..! 

  • మేష రాశి: నెయ్యి.. ఎరుపు రంగు వస్తువులు 
  • వృషభ రాశి: తామర పూలతో మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయడం.. దేవాలయంలో  దానం చేయడం శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
  • మిథున రాశి: పచ్చ పెసలు, రాగి లేదా మట్టి పాత్రలో నిండుగా నీటిని దానం
  • కర్కాటక రాశి: ఆకలితో ఉన్న వారికి పాయసం దానం 
  • సింహ రాశి: బెల్లాన్ని దానం చేయడం 
  • కన్య రాశి: నిరుపేదలకు అన్నదానం చేయడం ..  ఆహార పదార్థాలను దానం చేయండి. 
  • తులా రాశి: తెల్ల నువ్వులతో చేసిన లడ్డూలు
  • వృశ్చిక రాశి: కుంకుమపువ్వు.. బ్రాహ్మణులకు  ఎరుపు రంగులో వస్తువులు దానం
  • ధనుస్సు రాశి: బ్రాహ్మణులకు దక్షణ ఇవ్వండి.( శక్తి మేరకు ఇవ్వాలి లోపించకూడదు) 
  • మకర రాశి: నల్ల నువ్వులతో చేసిన లడ్డూలను దానం 
  • కుంభ రాశి: నల్ల నువ్వులు,  దుప్పట్లు , కంబళ్లు దానం
  • మీన రాశి: నల్ల నువ్వులు,  ధాన్యాన్ని దానం

దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి

ఈ పవిత్రమైన ఏకాదశి రోజున దానం చేసేటప్పుడు మనసులో భక్తి ఉండాలి. మనం ఇచ్చే వస్తువు విలువ కంటే, ఆ వస్తువును పొందే వ్యక్తికి అది ఏ మేరకు ఉపయోగపడుతుందనేది ముఖ్యం. దానం చేసిన తర్వాత ఫలితం ఆశిస్తాం.  మనం  చేసే దానం భగవంతుడికి చేరువ చేస్తుంది. ముఖ్యంగా మీ రాశికి చెప్పిన వస్తువులను ఆ రోజున దానం చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి.

ALSO READ : ఆధ్యాత్మికం.. జులై 10 చాలా విశిష్టమైన రోజు.. 

యోగిని ఏకాదశి విశిష్టత

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా యోగిని ఏకాదశి రోజున చేసే స్నానం, దానం, జపతపాలు విశేష ఫలితాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం. ఈసారి జూలై 10న ఉదయం 8:16 గంటలకు ప్రారంభమై, జూలై 11 ఉదయం 5:22 వరకు ఏకాదశి తిథి ఉంది. అయితే సూర్యోదయం సమయంలో ఏ రోజు ఏకాదశి ఘడియలు లేనందున ముందు రోజునే ( జులై 10) ఏకాదశి తిథిగా పరిగణిస్తారు.  ఈ పవిత్ర సమయంలో భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ముఖ్యంగా ఈ శుభప్రదమైన వేళ, మన రాశికి అనుగుణంగా దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.