July 9, 2026

తాగొచ్చి వేధిస్తున్నాడని చంపేశారు.. నిజామాబాద్ జిల్లా మోపాల్లో మరో దారుణం

తాగొచ్చి వేధిస్తున్నాడని చంపేశారు.. నిజామాబాద్ జిల్లా మోపాల్లో మరో దారుణం
Reading Time: < 1 minute

తాగొచ్చి వేధిస్తున్నాడని చంపేశారు.. నిజామాబాద్ జిల్లా మోపాల్లో మరో దారుణం

Caption of Image.

నిజామాబాద్​రూరల్, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్​మండలంలో టాయ్​లెట్​క్లీనర్​నరాల్లోకి ఎక్కించి ప్రశాంత్​ను భార్య సంధ్య హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే చంపేసినట్లు తెలుస్తోంది. 

మోపాల్​మండలం అమ్రాబాద్​పంచాయతీ పరిధిలోని కొక్యానాయక్​తండాకు చెందిన బానోత్​హరి(50) దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం.. బానోత్​హరి నిత్యం మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. బుధవారం కూడా మద్యం తాగొచ్చిన హరి ఇంట్లో గొడవకు దిగడంతో కుటుంబసభ్యులే గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 మృతుని సమీప బంధువు పవన్​ ఇచ్చిన ఫిర్యాదు, ఘటనాస్థలానికి చేరుకొని ఆనవాళ్లు సేకరించారు. హరి గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి భార్య మీరాబాయి, కొడుకు సురేశ్, కోడలు రజిత, కోడలి తమ్ముడు వెంకటేశ్​తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.