July 10, 2026

Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్‌ను హీరో చేశారు..

Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్‌ను హీరో చేశారు..
Reading Time: < 1 minute
Cpi Leader K Narayana Slams Cases Against Prashna Ravan Raises Free Speech Concerns

Narayana: ప్రశ్న రావణ్‌పై కేసు విషయంలో తీవ్రంగా మండిపడ్డారు సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ.. త్రేతాయుగంలో రావణుడు విలన్‌గా చూపించారు.. కానీ, కలియుగంలో రావణ్‌ను హీరో చేశారని పేర్కొన్నారు.. ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసులను తీవ్రంగా తప్పుబట్టారు నారాయణ.. మిమిక్రీ చేయడం లేదా రాజకీయ నాయకుల మాటతీరును అనుకరించడం నేరంగా పరిగణించరాదని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్‌ మాట్లాడిన శైలినే రావణ్ అనుకరించాడని, అలాంటి సందర్భంలో ముందు పవన్‌పైనే కేసు పెట్టాలా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఎంతోమంది రాజకీయ నాయకులను మిమిక్రీ ద్వారా అనుకరిస్తారు.. మిమిక్రీ చేసిన వారందరి పైనా కేసులు పెడతారా? అని నిలదీశారు..

రావణ్‌పై నమోదైన కేసుల్లో పలు కోర్టులు రిమాండ్‌ను తిరస్కరించినప్పటికీ, వరుసగా కొత్త కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నారాయణ అభిప్రాయపడ్డారు. చట్టాల్లోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని, అధికార యంత్రాంగం.. రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ నాయకుల తప్పుడు నిర్ణయాలు వ్యవస్థను, సమాజాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం చట్టాల అమలులో సమతుల్యత అవసరమని పేర్కొన్నారు నారాయణ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎందుకు లక్ష్మణరేఖను దాటుతున్నారు..? అని ప్రశ్నించారు.. రాజకీయ నాయకులు చెప్పిన పనులను చేయనని చెప్పొచ్చు కదా? అని సూచించారు.. రాజకీయ నాయకులు చెడిపోయి వ్యవస్థను, ప్రజలను కూడా చెడగొట్టేస్తున్నారు అని ఫైర్‌ అయ్యారు సీపీఐ జాతీయ నేత నారాయణ..