మీ రైలు టికెట్ వాట్సాప్, స్క్రీన్‌షాట్,PDF కాపీతో ప్రయాణించొచ్చా? కొత్త రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..

భారతీయ రైల్వే కొత్త టికెట్ బుకింగ్,డిజిటల్ టికెట్ రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై టిక్కెట్లు వాట్సాప్ , స్క్రీన్‌షాట్‌లు, ఫోటోలు లేదా PDF కాపీలతో ప్రయాణించడం చెల్లదు. టీటీఈ (TTE) చెకింగ్ సమయంలో వీటిని చూపిస్తే పరిగణనలోకి తీసుకోరు. టికెట్ లేని ప్రయాణంగా టీటీఈ ఫైన్ వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇకపై అన్ని టిక్కెట్ల బుకింగ్ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP)60 రోజులకు తగ్గించారు. ఇది జూలై 9వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.
చాలా రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్(ARP)ని తగ్గించారు. గతంలో ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి 120 రోజుల ముందు వరకు టిక్కెట్లను బుక్ చేయాల్సి ఉండేది. ఆ గడువును తక్షణమే అమల్లోకి వచ్చేలా 60 రోజులకు తగ్గించారు. దీంతో ముందుగా బుక్ చేసుకున్నవి చివరికి రద్దు కావడం తగ్గి, టిక్కెట్ల లభ్యత మెరుగుపడుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రయాణికులు చేయాల్సింది:
ఒరిజినల్ యాప్ తప్పనిసరి: రిజర్వేషన్ లేని టిక్కెట్లను Rail One app లేదా UTS app ద్వారా బుక్ చేసుకుంటే, ప్రయాణ సమయంలో టికెట్ ఆ యాప్‌లోనే ఉండాలి.
ఒకే ఫోన్ ఉండాలి: ఏ మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ డివైజ్ ద్వారా టికెట్ బుక్ చేశారో ప్రయాణంలో అదే ఫోన్ చూపించాలి.
తనిఖీలు: వాట్సాప్ ఫార్వర్డ్, స్క్రీన్‌షాట్ లేదా ప్రింట్ తీసిన పేపర్ చూపిస్తే వారిని టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించి భారీ జరిమానాలు విధిస్తారు.
టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చే కన్ఫర్మేషన్ SMS, లేదా నేరుగా యాప్‌లోకి లాగిన్ అయి టికెట్ చూపించాలి. ఎలక్ట్రానిక్ టికెట్ చూపించేటప్పుడు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ఆధార్, పాన్ కార్డు వంటివి కూడా వెంట ఉంచుకోవడం తప్పనిసరి.