ఇంటర్, డిప్లొమా అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలు.. పెళ్లి కాని పురుషులు, మహిళలకు సువర్ణావకాశం!

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అగ్నివీర్‌వాయు ఇన్‌టేక్ 02/2027, ఎయిర్‌మెన్ గ్రూప్ ‘వై’ (మెడికల్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: అగ్నివీర్‌వాయు ఇన్‌టేక్ 02/2027, ఎయిర్‌మెన్ గ్రూప్ ‘వై’ (మెడికల్ అసిస్టెంట్).
ఎలిజిబిలిటీ
అగ్నివీర్‌వాయు (సైన్స్ & ఇతర విభాగాలు): గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) లేదా సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి లేదా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
ఎయిర్‌మెన్ గ్రూప్ ‘వై’ (మెడికల్ అసిస్టెంట్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత లేదా ఫార్మసీలో డిప్లొమా/ బి.ఫార్మా/ బి.ఎస్సీ పూర్తిచేసి ఉండాలి లేదా కనీసం 50 శాతం మొత్తం మార్కులతోపాటు ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
అగ్నివీర్‌వాయు (సైన్స్ & ఇతర విభాగాలు): 2005, జులై 1 నుంచి 2010, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎయిర్‌మెన్ గ్రూప్ ‘వై’ (మెడికల్ అసిస్టెంట్):2006, జులై 1 నుంచి 2010, జులై 1మధ్యలో జన్మించి ఉండాలి.
ఫార్మసీ అభ్యర్థులు 2003, జులై 1 నుంచి 2008, జులై 1 మధ్యలో జన్మించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 6.
అప్లికేషన్ ఫీజు: అందరు అభ్యర్థులు రూ.550 చెల్లించాలి.
లాస్ట్ డేట్: జులై 26.
ఆన్‌లైన్ ఎగ్జామ్ తేదీలు: సెప్టెంబర్ 22, 23.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), శారీరక సామర్థ్య పరీక్ష (పీఎఫ్‌టీ), అడాప్టబిలిటీ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ agnipathvayu.cdac.in ను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. అగ్నివీర్‌వాయు (సైన్స్ విభాగాలు) పోస్టులకు ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.
►ALSO READ | బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్..ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ ఉద్యోగాలు.. కొద్దిరోజులు ఛాన్స్..
అగ్నివీర్‌వాయు (సైన్స్‌యేతర విభాగాలు) & ఎయిర్‌మెన్ గ్రూప్ వై (మెడికల్ అసిస్టెంట్) పోస్టులకు ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. రెండు రకాల పోస్టులకు ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానికి 1 మార్కు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.