ఇది ఫుట్‌బాలా.. ఫిక్సింగా?.. అర్జెంటీనాకే వరల్డ్కప్ ఇచ్చేయండి: ఈజిప్ట్

Argentina vs Egypt: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లల్లా ఈజిప్ట్ జట్టు 78వ నిమిషం దాకా 2–0తో ఫుల్ లీడ్‌ల ఉండె.. కానీ ఆ తర్వాత అర్జెంటీనా కమ్‌బ్యాక్ ఇచ్చి 3–2తో మ్యాచ్‌ను గుంజేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసినంక ఈజిప్ట్ కోచ్ హొస్సామ్ హసన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దారుణంగా తిట్టిపోసిండు. రెఫరీ, VAR (వీడియో అసిస్టెంట్ రెఫరీ) టీమ్ కలిసి కావాలనే అర్జెంటీనాకు ఫేవర్‌గా నిర్ణయాలు ఇస్తూ.. వాళ్లు గెలవడానికి గేట్లు బారేడు తెరిచారని ఆరోపించిండు. మ్యాచ్‌లో చాలా నిర్ణయాలు అర్జెంటీనాకే ప్లస్ అయినా.. ఈ రెండు పెద్ద నిర్ణయాలు మాత్రం ఈజిప్ట్ కొంపముంచినాయి.
వెనక్కి పోయి మరి ఈజిప్ట్ గోల్‌ను రద్దు చేస్తారా?:
ఈజిప్ట్ 1–0 లీడ్‌ల ఉన్నప్పుడు.. వాళ్ల మిడ్‌ఫీల్డర్ మోస్తఫా జికో ఒక అదిరిపోయే కౌంటర్ ఎటాక్‌తోని అదిరిపోయే గోల్ కొట్టిండు. నిజానికి ఆ గోల్ ఇచ్చుంటే ఈజిప్ట్ 2–0తో సేఫ్ జోన్‌లోకి వెళ్లేది. కానీ రెఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్‌ను VAR టీమ్ స్క్రీన్ చూసుకోమని పిలిచింది. ఆ గోల్ కొట్టడానికి ఓ 10 సెకన్ల ముందు, అండ్ 100 గజాల దూరంలో (ఈజిప్ట్ హాఫ్‌లో) అర్జెంటీనా ప్లేయర్ లిసాండ్రో మార్టినెజ్ కాళ్లను ఈజిప్ట్ మిడ్‌ఫీల్డర్ మర్వాన్ అత్తియా తొక్కిండు, షర్ట్ లాగిండు అని సాకు చూపించారు.
ఈజిప్ట్ ఫ్యాన్స్ ఆగ్రహం:
అర్జెంటీనా ఎటాక్ చేస్తున్నప్పుడు ఈజిప్ట్ డిఫెండర్లు బాల్‌ను లాక్కుని, గ్రౌండ్ మొత్తం పరిగెత్తుకుంటూ పోయి గోల్ కొడితే.. ఎక్కడో వంద గజాల వెనక జరిగిన చిన్న ఫౌల్‌ను పట్టుకొని గోల్ క్యాన్సిల్ చేయడం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జికో ఆ తర్వాత కొద్దిసేపటికే ఎలాగోలా ఇంకో గోల్ కొట్టి 2–0 చేసినా.. ఒకవేళ ఆ ముందటి గోల్ ఇచ్చి ఉంటే ఈజిప్ట్ 3–0తో మ్యాచ్‌ను గెలిచేది.
సలాహ్‌ను కింద పడేసినా పెనాల్టీ ఇవ్వరా: ఈజిప్ట్
మ్యాచ్ లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసరికి ఈజిప్ట్ మళ్లీ పుంజుకునేందుకు ట్రై చేసింది. ఆ టైమ్‌లో అర్జెంటీనా పెనాల్టీ బాక్స్‌లో ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మొహమ్మద్ సలాహ్‌ను జూలియన్ అల్వారెజ్ పక్కాగా షర్ట్ పట్టి లాగిండు, అతడి కాలును కూడా తొక్కి కింద పడేసిండు. ఈజిప్ట్ ప్లేయర్లు పెనాల్టీ కోసం గట్టిగనే డిమాండ్ చేశారు. రెఫరీ కళ్లముందే అంత పెద్ద ఫౌల్ జరిగినా ఆటను కంటిన్యూ చేయమన్నాడు. పోనీ VAR టీమ్ అయినా చెప్తదా అంటే.. వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు. ఈజిప్ట్ కొట్టిన గోల్ అప్పుడు వెనక్కి వెళ్లి మరీ ఫౌల్ వెతికిన VAR.. ఇక్కడ సలాహ్‌ను పెనాల్టీ బాక్స్‌లో అంత క్లియర్‌గా షర్ట్ లాగి పడేసినా పట్టించుకోకపోవడంతోపై సీరియస్ అవుతున్నారు.
ఈజిప్ట్ గుండె పగిలింది.. అర్జెంటీనా విన్నింగ్ గోల్:
అర్జెంటీనా ప్లేయర్లు పదే పదే ఫౌల్స్ చేస్తున్నా రెఫరీ కనీసం కార్డ్స్ కూడా ఇవ్వకుండా వదిలేసిండు. దీనికి సంబంధించిన ఒక వీడియో కంపైలేషన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమకు రావాల్సిన పెనాల్టీని అన్యాయంగా రద్దు చేయడంతో ఈజిప్ట్ క్యాంప్ మొత్తం తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయింది. ఆ బాధలో వాళ్లు ఉండగానే.. ఇంజూరీ టైమ్‌లో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ విన్నింగ్ గోల్ కొట్టి ఈజిప్ట్ గుండె పగిలేలా చేసిండు. అర్జెంటీనా క్వార్టర్స్‌కు పోయినా.. ఈ మ్యాచ్ లొల్లి మాత్రం వరల్డ్ కప్ చరిత్రలనే వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ మ్యాచ్‌గా నిలిచిపోయింది.
This is extremely soft. Would be incredibly unfair to give that a penalty. Have you seen such a soft penalty in your life? I’m not even gonna write any further about this. pic.twitter.com/g7nVzw9Azc
— MessiStan02 #bagged 😔 (@Stan_Incarnated) July 7, 2026