మ్యాచ్ ఇంగ్లాండ్‌లో.. క్రేజ్ ధోనీది.. ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద తలా కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!

MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టేడియం నుంచి బయటకు వస్తున్న మహీ భాయ్ ని చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు. గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడకపోగానే.. స్టేడియానికి వచ్చిన ధోనీని చూసి ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
కూల్‌గా ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన ధోనీ:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య ఎంఎస్ ధోనీ స్టేడియం నుంచి బయటకు వస్తుండగా, వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తమ అభిమాన క్రికెటర్‌ను దగ్గరి నుంచి చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. దీంతో ధోనీ.. ఫ్యాన్స్ చేసిన ఈ రచ్చకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చిరునవ్వుతో, కూల్‌గా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయాడు. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కంటే కూడా స్టేడియం బయట ధోనీకి లభించిన ఈ అపూర్వ స్వాగతమే ఇప్పుడు నెట్టింట అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.
►ALSO READ | 125 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. సంజు శాంసన్ రియాక్షన్ వైరల్!
లీడ్లో ఇంగ్లాండ్:
ఒకవైపు ధోనీ రాక అభిమానులకు సంతోషాన్నిచ్చినా, మూడో టీ20లో భారత జట్టు ప్రదర్శన మాత్రం తీవ్ర నిరాశపరిచింది. ఇంగ్లాండ్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. ఫలితంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్, ఈ విజయంతో సిరీస్‌లో 2–0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
This is not India, this is nottingham
The Craze for MS Dhoni is unmatched 🔥pic.twitter.com/wPVrdqjW63
— CSK Core (@CSKCore) July 8, 2026
#WATCH | Nottingham, England: Former Indian Cricket Team Captain Mahendra Singh Dhoni leaves the Trent Bridge Cricket Ground stadium after the third T20 match between India and England.
England won by 125 runs defeating India in the 3rd T20I. England lead the series 2-0. pic.twitter.com/ZQP1aojX3F
— ANI (@ANI) July 7, 2026