July 11, 2026

వైభవ్ సూర్యవంశీ వైఫల్యంపై ధోనీ సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజం చెప్పిన మిస్టర్ కూల్..!

వైభవ్ సూర్యవంశీ వైఫల్యంపై ధోనీ సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజం చెప్పిన మిస్టర్ కూల్..!
Reading Time: 2 minutes
వైభవ్ సూర్యవంశీ వైఫల్యంపై ధోనీ సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజం చెప్పిన మిస్టర్ కూల్..!

What MS Dhoni Thinks of Vaibhav Suryavanshi: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సంచలన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారే. ఒకరు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తే, మరొకరు 15 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న వేళ, అతని ఆటతీరుపై ధోనీ తొలిసారి స్పందించారు.

లండన్ పర్యటనలో తడబడుతున్న యువ కెరటం..

రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ పర్యటన పెద్దగా కలిసిరావడం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, ఇక్కడి పిచ్‌లపై పరుగులు సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 14 సగటుతో 42 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శ్రీలంకలో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో 200 పైగా స్ట్రైక్ రేట్‌తో, కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి రికార్డులు సృష్టించిన ఈ యువ ఆటగాడి ఫామ్ ఒక్కసారిగా పడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

ఇది కూడా చదవండి: గౌతమ్ గంభీర్‌కి గుడ్ బై.. కొత్త కోచ్ రేసులో ముగ్గురు దిగ్గజాలు.. సంచలన నిర్ణయం దిశగా బీసీసీఐ..?

వైభవ్ గురించి ధోనీ మనసులో మాట ఇదీ..!

క్రికెట్ ప్రపంచంలో వైభవ్ ప్రదర్శనపై చర్చ జరుగుతున్న వేళ, ధోనీ పుట్టినరోజు సందర్భంగా క్రీడా జర్నలిస్ట్ విమల్ కుమార్ ఆయనను కలిశారు. ఒకే రాష్ట్రానికి చెందిన వైభవ్‌ను ఎప్పుడైనా కలిశారా అని ప్రశ్నించగా ధోనీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తామిద్దరం అధికారికంగా ఎప్పుడూ కలుసుకోలేదని, కానీ ఒకసారి అనుకోకుండా ఒకరినొకరు దాటుకుంటూ వెళ్లామని, మాట్లాడుకునే అవకాశం రాలేదని ధోనీ స్పష్టం చేశారు. అయితే వైభవ్ ఆటపై స్పందిస్తూ.. “వైభవ్ సూర్యవంశీకి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ప్రపంచమంతా అతని ఆటను గమనిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించగల అద్భుతమైన నైపుణ్యం ఆ కుర్రాడిలో ఉంది” అంటూ ధోనీ కొనియాడారు. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న యువ ఆటగాడికి ధోనీ ఇచ్చిన ఈ మద్దతు పెద్ద ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు.

ఇంగ్లాండ్ గడ్డపై అసలు తప్పిదం ఎక్కడ జరిగింది..?

భారతదేశంలోని ఫ్లాట్ పిచ్‌లపై అలవోకగా సిక్సర్లు బాదిన వైభవ్‌కు ఇంగ్లాండ్ పిచ్‌లపై ఉన్న అదనపు బౌన్స్ పెద్ద శాపంగా మారింది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ల వేగాన్ని, పిచ్ నుంచి ఊహించని విధంగా వస్తున్న బౌన్స్‌ను ఎదుర్కోవడంలో వైభవ్ పొరపాట్లు చేస్తున్నాడు. షార్ట్ పిచ్ బంతులను సరిగ్గా అంచనా వేయలేక చెత్త షాట్లకు యత్నిస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు. అయితే ఈ ఇబ్బంది కేవలం వైభవ్‌కు మాత్రమే కాదు, భారత సీనియర్ బ్యాటర్లను సైతం ఇంగ్లాండ్ బౌలర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఘోరంగా విఫలమయ్యాడు.

ఇది కూడా చదవండి: వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

కుప్పకూలిన భారత్ టాప్ ఆర్డర్..

ఈ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ మాత్రమే నాలుగు మ్యాచ్‌ల్లో 190 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అభిషేక్ శర్మ వేగంగా ఆడుతున్నప్పటికీ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఇషాన్ కిషన్ 4 మ్యాచ్‌ల్లో కేవలం 16.5 సగటుతో 66 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటికే భారత జట్టు సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, జులై 11న సౌతాంప్టన్ వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ వైభవ్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..