July 9, 2026

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్ సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్ సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు
Reading Time: 2 minutes
OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్ సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సింగ్ గీతం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తోంది. వీటితో పాటు బల్టీ, పరిమళ అండ్ కో వంటి మరికొన్ని సినిమాలు శుక్రవారం (జులై 10) నుంచి స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి కంటే ముందే ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. కాన్సెప్ట్ పరంగా ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచిగానే కలెక్షన్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10కి 8.0 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కుమారి ఖండం అనే ఓ పౌరాణిక ప్రదేశం బ్యాక్ డ్రాప్ లో ప్రారంభమవుతుంది. ప్రాచీన కాలంలో ఋషులు దాచిపెట్టిన రహస్య గ్రంథాలు, చీకటి శక్తుల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. కలియుగంలో మళ్లీ రాక్షస శక్తులు పుట్టుకొచ్చినప్పుడు, దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఆ చీకటి శక్తులను అంతం చేయడానికి హీరో ఎలా పోరాడాడు అన్నదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్.

పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, క్షుద్ర పూజలతో తెరకెక్కించిన ఈ సినిమా పేరు త్రికాల: ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. మణి తెల్లగూటి తెరకెక్కించిన ఈ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలో శ్రద్ధా దాస్ ఓ సైకియాట్రిస్ట్ పాత్రలో నటించింది. అలాగే హీరో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవాంచ, నంద దొరై, రోబో శంకర్, రౌడీ రోహిణి (జబర్దస్త్) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  మరి థియేటర్లలో త్రికాల సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

సన్ నెక్ట్స్ లో త్రికాల సినిమా..

త్రికాల సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి