‘Love Oh Love’పై భారీ అంచనాలు: ధనుష్ మేనల్లుడు–నాగదుర్గ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది?

ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ హీరోయిన్‌గా మగేశ్ రాజేంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘లవ్ ఓ లవ్’. జులై 10న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే యూనివర్సల్ రొమాంటిక్ కామెడీ సినిమాలా అనిపిస్తోంది’ అంటూ బెస్ట్ విషెస్ చెప్పాడు. నిర్మాతలు సి.కళ్యాణ్, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, దర్శకుడు నాగేశ్వర రెడ్డి అతిథులుగా హాజరై మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
హీరో పవిష్ నారాయణన్ మాట్లాడుతూ ‘నాకిది రెండో సినిమా. దర్శకుడు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశా. నటుడిగా ఈ చిత్రంతో ఎంతో నేర్చుకున్నా. నాగదుర్గ కొత్త హీరోయిన్ అని చెప్పారు. కానీ తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న గుర్తింపు చూసి ఆశ్చర్యపోయా. మా సినిమాను తప్పకుండా చూసి ఆశీర్వదించండి’ అని కోరాడు.
A heart that truly loves never forgets. Some emotions stay forever. ❤️#LoveOhLoveFromJuly10 #LoveOhLove Trailer ⬇️
🔗 https://t.co/PHU6F6gIB5#LOL @zinemaindia @creativeentoffl @dineshrajoffl @dhananjayang @thinkmusicindia @PrimeVideoIN @Tentkotta @Pavishvofficial pic.twitter.com/ZaFJlN48o5
— Zinema Media (@zinemaindia) July 5, 2026
తెలుగు అమ్మాయినైన తాను తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం ఆనందంగా ఉందని నాగదుర్గ చెప్పింది. యువతకు నచ్చే కథతో ఈ సినిమా వస్తోందని, మంచి సందేశం ఉన్న సినిమా నిర్మించినందుకు గర్వపడుతున్నామని నిర్మాతలు దినేష్ రాజ్, జి. ధనంజేయన్ అన్నారు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా, దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్, నటి వనిత విజయ్ కుమార్, తెలుగులో రిలీజ్ చేస్తున్న సుబ్బారావు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.