July 8, 2026

నా కొడుకును మీరే తగలబెట్టుకోండి.. వాడి బూడిద కూడా నాకు వద్దు: ఆ తల్లి నిర్ణయంతో అందరూ షాక్

నా కొడుకును  మీరే తగలబెట్టుకోండి.. వాడి బూడిద కూడా నాకు వద్దు: ఆ తల్లి నిర్ణయంతో అందరూ షాక్
Reading Time: 2 minutes

నా కొడుకును మీరే తగలబెట్టుకోండి.. వాడి బూడిద కూడా నాకు వద్దు: ఆ తల్లి నిర్ణయంతో అందరూ షాక్

Caption of Image.

నేను నా కొడుకు మృతదేహాన్ని తీసుకోను.. చనిపోయిన నా కొడుడును మీ తగలబెట్టుకోండి.. వాడి బూడిద కూడా నాకు వద్దు.. నేను అసలు ఆస్పత్రికే రాను.. నా భర్త అనారోగ్యంతో ఇంట్లో మంచంపై పడి ఉన్నాడు.. అతన్ని చూసుకోవాలి.. నా కొడుకుకు సరైన శిక్షనే పడింది.. పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన కొడుకు తల్లి అన్న మాటలు ఇవి.. ఎంతో నిబ్బరంగా ఆ తల్లి చెప్పిన మాటలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బరుయిపూర్ ఏరియాలో.. 12 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడు ప్రభాస్ మండల్ అనే వ్యక్తి. రెండు రోజుల తర్వాత అతన్ని పట్టుకున్నారు. విచారణలో అతనే బాలికను అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే బాలికపై అత్యాచారం చేసిన ఘటనా స్థలానికి నిందితుడు ప్రభాస్ మండల్ ను తీసుకెళుతున్నారు పోలీసులు. దారి మధ్యలో పోలీస్ దగ్గర తుపాకీ లాక్కుని దాడి చేసి పారిపోవాలని ప్రయత్నించాడు ప్రభాస్ మండల్. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ప్రభాస్ మండల్ చనిపోయాడు. 

ప్రభాస్ మండల్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు.. 2026, జూలై 8వ తేదీ ఉదయం ఇద్దరు పోలీసులు అతని ఇంటికి వచ్చారు. తల్లి సంధ్యా మండల్ తో మాట్లాడారు. నీ కుమారుడు చనిపోయాడు.. అతని డెడ్ బాడీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంది.. మీరు రావాలి అనుకుంటే మాతో రండి తీసుకెళతాం అని పోలీసులు చెప్పారు. నేను ఆస్పత్రికి రాను అని చెప్పింది ఆ తల్లి. నా కుమారుడిని ఏం చేసుకుంటారో చేసుకోండి.. వాడిని మీరే తగలబెట్టుకోండి.. వాడి బూడిద కూడా నాకు వద్దు అంటూ మీడియాకు తెలిపింది. నా భర్త అనారోగ్యంతో మంచంపై ఉన్నాడు.. నేను వెళ్లే పరిస్థితుల్లో లేను.. మీరు ఏది కావాలనుకుంటే అది చేసుకోండి.. నాకు అభ్యంతరం లేదు అని తెగేసి చెప్పింది ఆ తల్లి సంధ్యా మండల్. 

►ALSO READ | ఎంత పని జేస్తివి బిడ్డా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న తల్లిని కాటికి సాగనంపిన కూతురు !

నా కొడుకు ప్రభాస్ మండల్ చేసిన పని,, అతను చేసిన నేరాలతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని.. అతను చేసిన నేరానికి.. అతను శిక్ష అనుభవించాడు.. ఇక మాకు అతనితో ఎలాంటి సంబంధం లేదు.. మమ్మల్ని వదిలేయండి అంటూ వేడుకుంది ఆ తల్లి సంధ్యా మండల్. నా కొడుకు మృతదేహాన్ని నా ఇంటికి కూడా తీసుకురాను.. నేను ఆస్పత్రికే రాను అంటూ స్పష్టం చేసింది ఆ తల్లి. వాడు ఇప్పటికే చచ్చిపోయాడు.. వాడి బూడిద కూడా మాకు వద్దు అంటూ ఆ తల్లి చెబుతున్న మాటలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. 

కొన్ని రోజుల క్రితం 12 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి.. ఆ తర్వాత చంపి చెరువులో పడేసిన కేసులో ప్రభాస్ మండల్ ప్రధాన నిందితుడు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. శాంతి భద్రతల విషయంపై ఆరోపణలు వచ్చాయి. కేసు విచారణలో భాగంగా ఘటన జరిగిన 72 గంటల్లోనే.. అంటే మూడు రోజుల్లోనే నిందితుడు ప్రభాస్ మండల్ పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. 

పోలీస్ ఎన్ కౌంటర్ లో తన కొడుకు చనిపోయిన తర్వాత..  అతని తల్లి సంధ్యా మండల్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.