కాళ్లపై పడినా కనికరించని కూతురు.. ప్రేమించినోడే కావాలని వెళ్లిపోయింది.. కన్నోళ్ల కంటే లవరే ఎక్కువనా..?

కన్న బిడ్డపై అంతు లేని ప్రేమ పెంచుకోవడమే ఈ తల్లిదండ్రులు చేసిన పాపమైపోయింది. భుజాల మీదకు ఎక్కించుకుని పెంచుకున్న కూతురు.. కాళ్ల మీద పడినా కనికరించదని తెలుసుకోలేకపోవడమే శాపమైపోయింది. ఇలాంటి రోజు ఒకటి తమ జీవితంలో వస్తుందని ఈ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు.
తమిళనాడులో జరిగిన హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులోని తిరుపత్తూరులో ఒక యువతి.. ఒక యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఆ కుటుంబానికి కూడా తెలిసిన సదరు యువకుడి ప్రవర్తనపై యువతి తల్లిదండ్రులకు సదభిప్రాయం లేదు.
Love Over Family? 💔
A heartbreaking incident unfolded in Tirupattur, Tamil Nadu, where a young woman chose to leave with her boyfriend despite her parents’ emotional pleas. In tearful scenes, her parents were seen crying and even falling at her feet in a desperate attempt to… pic.twitter.com/wHY2TxFT6T
— Orugallu Adda (@OrugalluAdda) July 8, 2026
ఆ అబ్బాయి మంచి వాడు కాదని, అతనిని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడతావని కుటుంబం హెచ్చరించింది. తల్లిదండ్రుల మాటను పట్టించుకోని ఈ కూతురు ప్రేమించిన అబ్బాయితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు యువతి తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఈ సమయంలోనే.. పోలీస్ స్టేషన్ బయట నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక పరిణామం మాత్రం అక్కడున్న వారినే కాదు ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరినీ కదిలించింది. గుండె బరువెక్కేలా చేసింది.
►ALSO READ | నా కొడుకును మీరే తగలబెట్టుకోండి.. వాడి బూడిద కూడా నాకు వద్దు: ఆ తల్లి నిర్ణయంతో అందరూ షాక్
కన్న బిడ్డలపై మమకారం పెంచుకున్న తల్లిదండ్రుల కళ్లలో నీళ్లు తిరిగేలా ఆ హృదయ విదారక దృశ్యం ఉంది. కన్న కూతురిని ఆమె ప్రియుడితో చూసిన తల్లిదండ్రులు తమతో వచ్చేయాలని కూతురిని బతిమలాడారు. కూతురి కాళ్ల మీద పడి వేడుకున్నారు. తమతో ఇంటికి రావాలని కూతురి కాళ్లు పట్టుకుని వదల్లేదు. అయినప్పటికీ కూతురి మనసు కరగలేదు. కన్న తల్లిదండ్రుల కంటే ప్రేమించిన వాడే ఎక్కువని అతనితో వెళ్లిపోయింది.
ఈ పరిణామం.. కన్న బిడ్డలపై అమితమైన ప్రేమ పెంచుకుంటున్న తల్లిదండ్రులను ఆలోచనలో పడేసింది. కాళ్లావేళ్లా పడినా ఈ కూతురు కనికరించకపోవడంపై నెట్టింట పెద్ద చర్చనే జరిగింది. ఇలాంటి కూతురు ఉంటేనేం, పోతేనేం అని కొందరంటుంటే.. ఆ తల్లిదండ్రులు ఎమోషనల్ డ్రామా ప్లే చేశారని.. ప్రేమించిన వాడితో వెళ్లడంలో తప్పేంటని ఈతరం నెటిజన్లు కూతురిని సమర్థిస్తున్నారు.