July 8, 2026

యాదాద్రి జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

యాదాద్రి జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
Reading Time: < 1 minute

యాదాద్రి జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

Caption of Image.

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. జిల్లాలోని 23 సంఘాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 18 సంఘాలకు ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. పోటీలో ఉన్న 332 మంది అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అధికారులు మూడు వేర్వేరు రంగుల బ్యాలెట్ పేపర్లను ఎక్కడికక్కడ ప్రింట్ చేయిస్తున్నారు.

జనరల్ కేటగిరీ డైరెక్టర్ల అభ్యర్థుల కోసం తెలుపు రంగు, మహిళా కేటగిరీ కోసం గులాబీ రంగు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థుల కోసం నీలం రంగు బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి బ్యాలెట్ పేపర్ సైజును  ఎ4 నుంచి ఎ3 పేపర్​ సైజ్​ కన్నా ఎక్కువగా  నిర్ణయిస్తున్నారు.

ఒక్కో బ్యాలెట్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒకే వైపున అభ్యర్థి ఫొటో, పేరు, దాని పక్కనే బ్లాక్ అండ్ వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన గుర్తును ముద్రిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు గరిష్ఠంగా 9 మంది డైరెక్టర్లకు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ కేటగిరీలో ఆరుగురికి, మహిళా కేటగిరీలో ఇద్దరికి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఒక్కరికి మాత్రమే ఓటు వేయాలి. 

పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ఈ నిర్దేశిత సంఖ్య కంటే అదనంగా ఒక్క ఓటు ఎక్కువ వేసినా అది చెల్లని ఓటుగా ప్రకటిస్తారు. నిర్ణయించిన సంఖ్య కంటే తక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేస్తే మాత్రం ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల గుర్తుల కోసం రాష్ట్ర కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ప్రాథమికంగా కేటాయించిన 24 గుర్తులతో పాటు, అదనంగా మరో 54 గుర్తులను కూడా అందుబాటులో ఉంచింది.

©️ VIL Media Pvt Ltd.