మీ భాగస్వామితో రిలేషన్షిప్ బోర్ కొడుతుందా? మళ్లీ ప్రేమ చిగురించే చిట్కాలు మీ కోసం
ఎప్పుడూ ఒకే రకమైన రొటీన్ లైఫ్ వల్ల బంధంలో విసుగు రావడం సహజం. అయితే, ఈ విసుగు వల్ల బంధం బలహీనపడకుండా, తిరిగి మీ భాగస్వామితో ఆ పాత రొమాన్స్, లవ్ పెంచుకోవడానికి రిలేషన్షిప్ నిపుణులు కొన్ని చక్కటి మార్గాలను సూచిస్తున్నారు.
ఇద్దరూ కలిసి కొత్త ప్రయాణాలు: రిలేషన్షిప్లో బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇద్దరూ కలిసి తరచూ కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు ప్లాన్ చేయాలి. రొటీన్ వాతావరణం నుండి బయటపడి సరికొత్త వాతావరణంలోకి వెళ్లినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, సరికొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ప్రయాణాలు ఎంతగానో తోడ్పడతాయి. ఇది భాగస్వాముల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
మనసు విప్పి మాట్లాడుకోవడం: ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ రాత్రి పూట లేదా వీకెండ్స్‌లో భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. కేవలం ఇంటి ఖర్చులు, ఆఫీసు విషయాలు, సమస్యల గురించే కాకుండా.. ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం ముఖ్యం. భాగస్వామి చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం వల్ల వారిపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్ ఉన్న బంధంలో ఎలాంటి విసుగుకైనా తావుండదని నిపుణులు చెబుతున్నారు.
చిన్న చిన్న సర్ప్రైజ్లతో ఆనందం: భాగస్వామిని సంతోష పెట్టడానికి పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేదు. వారికి ఇష్టమైన చాక్లెట్, ఒక చిన్న ప్రేమ లేఖ, లేదా అనుకోకుండా ఇచ్చే ఒక రోజా పువ్వు కూడా వారి ముఖంలో ఎంతో ఆనందాన్ని తెస్తాయి. ఈ చిన్న చిన్న సర్ప్రైజ్లు “నేను నీ గురింŚచి ఆలోచిస్తున్నాను” అనే బలమైన సందేశాన్ని అవతలి వారికి అందిస్తాయి. ఈ అలవాటు బంధంలో ఎప్పుడూ కొత్తదనాన్ని, మధురానుభూతిని నిలిపి ఉంచుతుంది.
ప్రత్యేకమైన డేట్ నైట్స్ ప్లాన్ చేయడం: పెళ్లయి ఇన్నేళ్లు దాటినా మునుపటి ప్రేమానురాగాలు కొనసాగాలంటే ‘డేట్ నైట్’ సంస్కృతిని అలవాటు చేసుకోవాలి. పిల్లలు, కుటుంబ బాధ్యతలను కాసేపు పక్కన పెట్టి, కేవలం మీ ఇద్దరి కోసమే ఒక సాయంత్రాన్ని కేటాయించుకోండి. చక్కగా తయారై మంచి రెస్టారెంట్‌కు వెళ్లడం లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం వల్ల పాత రోజుల నాటి రొమాన్స్ మరియు ఆకర్షణ మళ్లీ చిగురిస్తాయి.
కొత్త విషయాలను ప్రయత్నించండి: బంధంలో బోర్ కొట్టడానికి ప్రధాన కారణం ఒకే రకమైన పనులను పదే పదే చేయడం. దీని నుంచి బయటపడటానికి ఇద్దరూ కలిసి కొత్త విషయాలను అన్వేషించాలి. ఉదాహరణకు, ఎప్పుడూ వెళ్లే రెస్టారెంట్లకు కాకుండా కొత్త ప్రదేశాలకు వెళ్లడం, ఇద్దరికీ ఇష్టమైన ఏదైనా కొత్త హాబీ లేదా క్లాస్‌లో ఉదాహరణకు కుకింగ్, డాన్స్, లేదా ఏదైనా స్పోర్ట్ జాయిన్ అవ్వడం చేయాలి. ఇది మీ ఇద్దరి మధ్య సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.





