భారత్‌లో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్.. అసలు కారణం చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని!

Big Bash League In India: ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ (BBL) క్రికెట్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపనుంది. రాబోయే బిగ్ బాష్ లీగ్ 2026–27 సీజన్ యొక్క ప్రారంభ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈరోజు (జూలై 10న, శుక్రవారం) మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు.
చెన్నై వేదికగా తొలి విదేశీ లీగ్ మ్యాచ్:
డిసెంబర్ 12న చెన్నైలోని చెపాక్ స్టేడియం (MA చిదంబరం స్టేడియం) వేదికగా ఈ చారిత్రాత్మక మ్యాచ్ జరగనుంది. బిగ్ బాష్ లీగ్ నయా సీజన్ తొలి మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ వర్సెస్ పెర్త్ స్కోర్చర్స్ జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా వెలుపల జరగబోతున్న మొట్ట మొదటి బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా, భారతదేశంలో నిర్వహించబడుతున్న తొలి విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించనుంది.
జీ డే నమస్తే ఫెస్టివల్:
ఈ మ్యాచ్ డిసెంబర్ నెలలో భారతదేశంలో జరగబోయే వారం రోజుల సుదీర్ఘమైన జీ డే నమస్తే (G Day Namaste) ఉత్సవాల్లో భాగంగా ఉండనుంది. ఈ ఉత్సవాల్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియాకు సంబంధించిన సాంస్కృతిక, వ్యాపార, క్రీడా ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, భారతదేశాలను క్రీడలపై ఉన్న ప్రేమ, ప్యాషన్ ఒకటి చేస్తోంది. క్రీడల పరంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచడంతో కేవలం అభిమానులకు ఆనందం కలగడమే కాకుండా.. వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడుల రంగాలు కూడా బలోపేతం అవుతాయి. అందుకే ప్రధాని మోడీ, నేను కలిసి ఇరు దేశాల క్రీడా సహకార రోడ్‌మ్యాప్‌ను ప్రారంభించామన్నారు.
►ALSO READ | ఫ్రాన్స్ గెలిచింది.. నోరా ఫతేహి ఏడ్చింది.. నెట్టింట వీడియో వైరల్!
భారత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నజర్:
క్రికెట్‌కు అత్యంత ఆదరణ ఉన్న భారతదేశంలో బిగ్ బాష్ లీగ్‌కు మరింత గ్లోబల్ రీచ్, సరికొత్త అభిమానులను సంపాదించాలనే వ్యూహంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ అడుగు వేసింది. ప్రస్తుతం ఈ చెన్నై మ్యాచ్‌ను ఒక ఏడాది ఒప్పందంగా ప్లాన్ చేశారు. భారత వర్సెస్ ఆస్ట్రేలియా అభిమానులకు పూర్తి స్థాయి బిగ్ బాష్ లీగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా నిర్వాహకులు పని చేస్తున్నారు. BBL 2026–27 లీగ్ పూర్తి షెడ్యూల్ వచ్చే వారం విడుదల కానుంది. డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత, మిగిలిన టోర్నమెంట్ మ్యాచ్‌లు డిసెంబర్ 15 నుంచి ఆస్ట్రేలియాలో యథావిధిగా కొనసాగుతాయి. ఈ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాలో సెవెన్ నెట్‌వర్క్, ఫాక్స్ క్రికెట్ ఛానెళ్లలో ప్రసారం చేయనుండగా, భారత వీక్షకుల నుంచి కూడా భారీ రెస్పాన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
पहली बार भारत विदेश की कोई क्रिकेट लीग आयोजित करेगा.
ऑस्ट्रेलिया दौरे पर पीएम मोदी और एंथनी अल्बनीज़ ने साझा बयान जारी किया
IPL की तरह ऑस्ट्रेलिया की BIG BASH T-20 लीग का आयोजन भारत करेगा. pic.twitter.com/DTMObw5exz
— Abhishek Dwivedi /अभिषेक द्विवेदी 🇮🇳 (@Dubeyjilive) July 10, 2026
Opening the season like never before 💥
Chennai, get ready for #BBL16 🇮🇳 pic.twitter.com/rqTr0mE0ip
— KFC Big Bash League (@BBL) July 10, 2026
🇮🇳 #BBL16 on the global stage 📈
The most-watched game in Australian domestic sports league history is expected when the @RenegadesBBL take on the @ScorchersBBL in India. pic.twitter.com/ikjUu7RRWa
— KFC Big Bash League (@BBL) July 10, 2026
#WATCH | Melbourne, Australia | Accompanying PM Modi at the Melbourne Cricket Ground (MCG), Australian Prime Minister Anthony Albanese says, “Today I announced that Australia will bring the Big Bash League to India for the first time. The season opener for this summer’s Big Bash… pic.twitter.com/vXyWD7nV97
— ANI (@ANI) July 10, 2026