July 9, 2026

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అప్రెంటీస్ జాబ్స్.. లోకల్ లాంగ్వేజ్ ఆధారంగా ఎంపిక.. డిగ్రీ ఉంటే ట్రై చేయండి..

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అప్రెంటీస్ జాబ్స్..  లోకల్ లాంగ్వేజ్ ఆధారంగా ఎంపిక.. డిగ్రీ ఉంటే ట్రై చేయండి..
Reading Time: < 1 minute

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అప్రెంటీస్ జాబ్స్.. లోకల్ లాంగ్వేజ్ ఆధారంగా ఎంపిక.. డిగ్రీ ఉంటే ట్రై చేయండి..

Caption of Image.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) 2026–-27 ఆర్థిక సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 750 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: అప్రెంటీస్. 

మొత్తం ఖాళీలు: 750.  తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2026, జులై 31 లేదా అంతకంటే ముందే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 7.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.236, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు రూ.708, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు రూ.944.

లాస్ట్ డేట్: జులై 20.

ఆన్​లైన్ ఎగ్జామినేషన్: ఆగస్టు 2 (తాత్కాలికం).  
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iob.bank.inను సందర్శించండి. 

►ALSO READ | SAIL ఉద్యోగ నోటిఫికేషన్.. 40 ఏళ్లలోపు వారికి సువర్ణావకాశం.. పూర్తి వివరాలు ఇవే!

©️ VIL Media Pvt Ltd.