July 10, 2026

PM Modi: మోదీ మరో సంచలనం.. ఆస్ట్రేలియా పర్యటనలో కీలక పరిణామం

PM Modi: మోదీ మరో సంచలనం.. ఆస్ట్రేలియా పర్యటనలో కీలక పరిణామం
Reading Time: 2 minutes
PM Modi: మోదీ మరో సంచలనం.. ఆస్ట్రేలియా పర్యటనలో కీలక పరిణామం

PM Modi: ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా సంచలనం సృష్టిస్తారు. ఆస్ట్రేలియాలో కూడా అదే జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. తన ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో 18 ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో అత్యంత ముఖ్యమైన ఒప్పందం యురేనియంకు సంబంధించింది. ఆస్ట్రేలియాలో తన చారిత్రాత్మక పర్యటన తర్వాత, ప్రధాని మోదీ ఇప్పుడు న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాలో తన చారిత్రాత్మక పర్యటన జరిగిన మరుసటి రోజే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి వార్తాపత్రికల ముఖ్యాంశాలలో నిలిచారు. ఒక ఆస్ట్రేలియా వార్తాపత్రిక కాలమిస్ట్ ఆయనను ‘మిస్టర్ ఇండియా’ అని కూడా సంబోధించారు. అంతేకాదు, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో ప్రధాని మోదీ జరిపిన సంభాషణను అక్కడి ప్రధాన వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

ఆస్ట్రేలియా వార్తాపత్రిక ప్రధాని మోదీ పర్యటనను తన ముఖపత్రంలో ప్రచురించింది. “వాణిజ్యం, రక్షణ రంగాలలో మోదీ బహుమతులు తెచ్చారు” అని శీర్షిక పేర్కొంది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మరో ప్రముఖ వార్తాపత్రిక ‘ది ఏజ్’ కూడా ప్రధాని మోదీ పర్యటనను తన మొదటి పేజీలో ప్రచురించి, ‘అల్బనీస్ ‘మోదీ ఆపరేండీ’, అంటే మోదీ పనులు చేసే విధానం’ అనే మూడు పదాల శీర్షికను పెద్ద అక్షరాలతో ప్రచురించింది.

ప్రధానమంత్రి మోదీ ఈ పర్యటన సందర్భంగా యురేనియం ఎగుమతి, పునరుత్పాదక ఇంధనం, కీలక ఖనిజాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలలో సహకారాన్ని పెంచుకోవాలని భారత్, ఆస్ట్రేలియా దేశాలు ప్రకటించాయి. శాంతియుత అణుశక్తి వినియోగం కోసం ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి యురేనియం ఎగుమతి చేయడానికి ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. భారతదేశం తన అణు విద్యుత్ సామర్థ్యాన్ని విస్తరించాలనే ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, అలాగే ఆస్ట్రేలియా వనరుల రంగానికి మరో మార్కెట్‌ను అందించడం ఈ ఒప్పందం లక్ష్యం.

భారతదేశం, ఆస్ట్రేలియా మంచి మిత్రదేశాలు:

మెల్బోర్న్‌లో ఒప్పందాన్ని ఖరారు చేసిన అనంతరం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ, “ఆస్ట్రేలియా, భారతదేశం కేవలం సన్నిహిత భాగస్వాములే కాదు, గొప్ప మిత్రులు కూడా” అని అన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం చారిత్రాత్మక అవకాశాలను అందిస్తుందని అన్నారు. భారతదేశంలోని రోడ్లు, ఓడరేవులు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆస్ట్రేలియా కంపెనీలను ప్రోత్సహించారు.

మోడీని ఒక సజీవ వారధి:

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అల్బనీస్, ప్రధాని మోదీని ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య ఒక శక్తివంతమైన వారధిగా అభివర్ణించారు. ఆయన నాయకత్వం ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించడంలో సహాయపడిందని అన్నారు. ప్రధాని మోదీ మెల్‌బోర్న్‌లో భారతీయ సమాజానికి చెందిన ఒక భారీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ వేలాది మంది ప్రజలు “మోదీ, మోదీ” అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానిగా తాను ఆస్ట్రేలియాలో చేస్తున్న మూడవ పర్యటన, భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు బలపడుతున్నాయని తెలియజేస్తోందని ఆయన అన్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్చ చేయండి