July 8, 2026

Vivo V80: వివో V80 Series ధర లీక్.. 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో భారత్‌లో త్వరలో లాంచ్?

Vivo V80: వివో V80 Series ధర లీక్.. 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో భారత్‌లో త్వరలో లాంచ్?
Reading Time: 2 minutes
Vivo V80 Series Leak Reveals Price 144hz Display And 7200mah Battery

Vivo V80 Series India Launch: వివో (Vivo) V80 సిరీస్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన లీకుల ప్రకారం, ఈ సిరీస్ వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధరతో పాటు డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అయితే, కంపెనీ ఇప్పటివరకు Vivo V80 Seriesకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వెలువడిన వివరాలు టిప్‌స్టర్లు, లీకుల ఆధారంగానే ఉన్నాయి.

Vivo V80 Series ఎప్పుడు విడుదల?

భారతీయ టిప్‌స్టర్ సంజు చౌదరి వెల్లడించిన సమాచారం ప్రకారం, Vivo V80 Series ఆగస్టు నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కంపెనీ రెండు లేదా మూడు మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల Vivo V70 Elite విడుదలైన నేపథ్యంలో, తర్వాతి దశలో V80 Elite మోడల్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ధర ఎంత ఉండొచ్చు?

లీకుల ప్రకారం, Vivo V80 Series ధర Oppo Reno 16 Series మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. Oppo Reno 16 సిరీస్ ప్రారంభ ధర రూ. 61,999గా ఉంది. Vivo V80 Seriesలో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ అందించే అవకాశం ఉందని సమాచారం.

అంచనా స్పెసిఫికేషన్లు

లీకుల ప్రకారం Vivo V80 Seriesలో 6.59-అంగుళాల 1.5K డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 3D ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

7200mAh భారీ బ్యాటరీ

ఈ సిరీస్‌లో 7200mAh సామర్థ్యం గల బ్యాటరీను అందించనున్నట్లు సమాచారం. అలాగే 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ కు మద్దతు ఉండే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ కారణంగా ఎక్కువ బ్యాకప్‌తో పాటు వేగవంతమైన ఛార్జింగ్ అనుభవం లభించవచ్చని అంచనా.

కెమెరా ఫీచర్లు

ఫోటోగ్రఫీ కోసం Vivo V80 Seriesలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. అందులో 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అందించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి.

ఇతర ఫీచర్లు

Vivo V80 Seriesలో IP68 & IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, Android 16 ఆధారిత OriginOS 6, ప్రీమియం డిజైన్, మెరుగైన AI ఫీచర్లు వంటి అంశాలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.