Eesha Rebba: విజయ్- రష్మిక బాటలోనే తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా.. త్వరలోనే శుభవార్త చెప్పనున్న లవ్ బర్డ్స్!

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బాల వ్యవహారం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరు ఇటీవలే ‘ఓంశాంతి శాంతి శాంతి’ అనే సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారని రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రేమ వ్యవహారంపై అటు తరుణ్ భాస్కర్ కానీ, ఇటు ఈషారెబ్బా కానీ అసలు నోరు విప్పడం లేదు. ఎవరైనా ఈ విషయం గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు. ఓ సందర్భంలో మాత్రం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. తనకు అన్నీ ఈషానే అని, ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఓపెన్ గా చెప్పేశాడు. దీంతో వీరు ప్రేమాయణం నిజమేనని ఖరారైంది.
తాజాగా తమ ప్రేమ పుకార్లకు మరింత బలాన్నిస్తూ మరోసారి జంటగా కనిపించారు తరుణ్-ఈషారెబ్బా. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పక్కపక్కన నడుస్తూ కనిపించారీ ల వ్ బర్డ్స్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోది. కాగా గతంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కూడా ఇలాగే సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తరుణ్-ఈషాలు కూడా వారి దారినే ఫాలో అవ్వనున్నారని తెలుస్తోంది. ‘విరుష్’ల మాదరిగానే వీరు కూడా త్వరలోనే శుభవార్త చెప్పనున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఎయిర్ పోర్ట్ లో ఈషా రెబ్బా- తరుణ్ భాస్కర్.
New Couple Very Soon
#EeshaRebba #TharunBhascker pic.twitter.com/iaEvK4RW9h
— Hatoffcine (@Hatoffcine_) July 8, 2026
కాగా ‘ఓంశాంతి శాంతి శాంతి’ అనే సినిమా తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు ఈషా రెబ్బా- తరుణ్ భాస్కర్. అయితే ఈ డైరెక్టర్ మాత్రం ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యింది. అయితే ఇప్పుడీ ఈ సినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చిన తరుణ్ ఈషాతో వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈషా రెబ్బా గ్లామరస్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


