బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలయ్య చివరిగా నటించిన అఖండ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ డేస్లో బాలయ్య నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు.
ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు బాలయ్య. ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. కాగా బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు బాలకృష్ణ.
అయితే బాలకృష్ణకు తల్లిగా, భార్యగా నటించిన హీరోయిన్స్ కూడా కొంతమంది ముద్దుగుమ్మలు ఉన్నారు. వారిలో ఈ ఈ అందాల భామ ఒకరు. ఆమె ఒకే ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆమె అందానికి అంతా ఫిదా అయ్యారు. కానీ ఆమె ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి మాయం అయ్యింది. ఇంతకూ ఎవరో కనిపెట్టరా.? ఆమె పేరు చెప్తే కుర్రాళ్ళు కిర్రెక్కిపోతారు.
హానీ రోజ్.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. హనీరోజ్.. తెలుగులో ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయ్యిపోయింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
వీరసింహారెడ్డి సినిమాలో రెండు డిఫరెట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. బాలకృష్ణ తల్లిగా, భార్యగా నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు అందంతోనే కాదు నటన పరంగాను మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.




