ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. సన్నగా కనిపించాలని అస్సలు తినేది కాదు.. చివరకు అలా చనిపోయింది

నటుడు, రచయిత తోటపల్లి మధు అంటే గుర్తుపట్టడం కష్టమే కానీ ఆయన చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పలు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాలపై, వారి ఆర్థిక స్థితిగతులపై పలు విషయాలను వెల్లడించారు. దివంగత నటి శ్రీదేవి మరణం, నటుడు శోభన్ బాబు జీవిత విశేషాలతో పాటు పలు రాజకీయ అంశాల పైనా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. శ్రీదేవి మరణంపై మధు మాట్లాడుతూ, ఆమెకు హై డయాబెటిస్ ఉందని, బరువు పెరుగుతారనే భయంతో ఆమె సరిగా తినలేదని తెలిపారు. తన ఇద్దరు కుమార్తెలు అనుకున్నంత స్థాయికి రాకపోవడం, సినిమా అవకాశాలు తగ్గడం, భారీ ఖర్చులతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.
ఈ ఒత్తిడి కారణంగా శ్రీదేవి మద్యానికి బానిసయ్యారని తెలిపారు తోటపల్లి మధు. ఆమె ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మందు తాగేవారు. చనిపోయిన రోజు ఆమె ఒంటరిగా ఉన్నారు. అప్పటికీ బోనీ కపూర్ ఫోన్ చేసి ఇంజెక్షన్ తీసుకోవాలని సూచించినప్పటికీ, ఆమె ఇంకో పెగ్గు వేసుకుని స్నానానికి వెళ్లి బాత్‌రూంలోనే కోమాలోకి వెళ్లిపోయారని వివరించారు. సావిత్రి మరణానికి, శ్రీదేవి మరణానికి సారూప్యత ఉందని, సావిత్రి 14 నెలలు బాధపడితే, శ్రీదేవికి 14 నిమిషాలు పట్టిందని మధు పోల్చారు. మరో దివంగత నటుడు శోభన్ బాబు జీవితాన్ని ప్రస్తావిస్తూ, ఆయన చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అని, ఆయన జీవితం గుప్తంగా ఉండేదని మధు పేర్కొన్నారు. శోభన్ బాబుకు ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, వారిలో కొందరికి వ్యాపారం పెట్టుకోవడానికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసేవారని తెలిపారు.
ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్
శోభన్ బాబు టాప్ హీరోగా సంపాదించిన డబ్బును స్థలాలపై పెట్టుబడిగా పెట్టి బాగా అభివృద్ధి చెందారని మధు వెల్లడించారు. ఆయన జీవితంలో 1971 నుండి 1977 వరకు జయలలితతో మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. MGR స్విస్ బ్యాంక్‌లో దాచిన 3000 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలను జయలలిత శోభన్ బాబుకు ఇచ్చారని, ఆ డబ్బును స్థలాలపై పెట్టుబడి పెట్టి జయలలితకు సగం, తనకు సగం చేసుకున్నారని తోటపల్లి మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో 3000 కోట్లు అంటే ఇప్పుడు 3 లక్షల కోట్ల విలువ ఉంటుందని ఆయన అంచనా వేశారు.
ఇది కూడా చదవండి : Nagarjuna: నాగార్జునకు విలన్‌గా ఆ అందాల భామ.. కింగ్ 100వ సినిమా కోసం మాస్టర్ ప్లాన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి