July 9, 2026

Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!

Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
Reading Time: < 1 minute
Chiranjeevi 70 Age Passion Rain Action Scene Mega158 Shooting

70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ, వెండితెరపై తన మార్క్ మేజిక్‌ను రిపీట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా ఆరు పదులు దాటితేనే నటీనటులు కాస్త నెమ్మదిస్తారు, రిస్క్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్లకు వీలైనంత వరకు డూప్‌లను వాడుతుంటారు. కానీ, చిరంజీవి డిక్షనరీలోనే ఆ పదం లేనట్టుంది. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని ఆయన మరోసారి నిరూపించారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం #MEGA158 (బాబీ కొల్లి) షూటింగ్‌లో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర సంఘటన మెగాస్టార్‌పై ఉన్న అంచనాలను, ఆయనకున్న సినిమా ప్యాషన్‌ను అమాంతం పెంచేసింది.

ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఒక అత్యంత క్లిష్టమైన ‘రెయిన్ యాక్షన్ ఎపిసోడ్’ను ప్లాన్ చేసింది. రాత్రి వేళ, పైగా కృత్రిమ వర్షంలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం అనేది శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఆరోగ్య రీత్యా ఇలాంటి సీన్లకు డూప్‌లను వాడుదామని దర్శకుడు, నిర్మాతలు కోరినప్పటికీ.. చిరంజీవి మాత్రం అందుకు సున్నితంగా నిరాకరించారు. ప్రేక్షకులకు వెండితెరపై కంప్లీట్ ఒరిజినాలిటీని అందించాలనే పట్టుదలతో ఆయన స్వయంగా దాదాపు 12 గంటల పాటు నిరంతరాయంగా, ఆ వానలోనే తడుస్తూ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. దశాబ్దాల కెరీర్, వందలాది సినిమాలు, కోట్లాది మంది అభిమానులు.. ఇప్పటికే సాధించాల్సినవన్నీ సాధించేసినా, ఈ వయసులో చిరంజీవికి సినిమాపై ఉన్న ఈ కసి, ప్యాషన్ నిజంగా అద్భుతం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. “సినిమా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే సినిమా.. ఇందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా, 70 ఏళ్ల వయసులో కూడా చిరు చూపిస్తున్న ఈ స్ఫూర్తి, నేటి తరం యంగ్ హీరోలకు ఒక పెద్ద రోల్ మోడల్ అని చెప్పక తప్పదు.