6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!

ఐక్యూ (iQOO) భారత మార్కెట్‌లో మరో కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ iQOO Z11 పేరుతో వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, కంపెనీ తాజాగా దీనిని iQOO Z11 Lite పేరుతో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని iQOO ఇండియా సీఈఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీని కోసం అమెజాన్‌లో ఈ ఫోన్‌కు ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ కావడంతో త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు అర్థమయ్యింది.
టీజర్ పోస్టర్ ప్రకారం iQOO Z11 Lite ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో రానుంది. వెనుక భాగంలో పిల్-షేప్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరాలతో పాటు LED ఫ్లాష్, రింగ్ లైట్ కూడా ఉండనున్నాయి. ఆఫ్-వైట్ కలర్ వేరియంట్‌ను కంపెనీ ఇప్పటికే టీజ్ చేసింది. ఫోన్ కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌లు ఉండగా, దిగువ భాగంలో iQOO బ్రాండింగ్ కనిపించనుంది.
లీకైన వివరాల ప్రకారం iQOO Z11 Liteలో ఆక్టా-కోర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh సామర్థ్యమున్న భారీ బ్యాటరీని అందించే అవకాశం ఉంది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుందని సమాచారం. ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు వాటర్‌డ్రాప్ నాచ్‌లో 5MP ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు లీకులు చెబుతున్నాయి.
డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉండనుంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించే అవకాశం ఉంది. అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం ఈ ఫోన్‌లో Vivo OriginOS ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పాటు AI ఆధారిత ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండనున్నట్లు సమాచారం. దీంతో దుమ్ము, తేలికపాటి నీటి చినుకుల నుంచి ఫోన్‌కు రక్షణ లభిస్తుంది. లీకైన సమాచారం ప్రకారం iQOO Z11 Lite భారత మార్కెట్లో సుమారు రూ.15,000 ధరలో విడుదలయ్యే అవకాశం ఉంది. అధికారిక లాంచ్ తేదీని కంపెనీ త్వరలో ప్రకటించనుంది.
For every student need, there’s a Gen-Z way of doing it.
Soon, there will be a Z for it too.#ComingSoon #iQOOZ11Lite #NonStopNoLimits pic.twitter.com/lX7UsNSflL
— Nipun Marya (@nipunmarya) July 7, 2026