July 9, 2026

2027 వరల్డ్ కప్ కోసం పాక్ ప్రిపరేషన్ షురూ.. కొత్త టోర్నీతో బిగ్ ప్లాన్!

2027 వరల్డ్ కప్ కోసం పాక్ ప్రిపరేషన్ షురూ.. కొత్త టోర్నీతో బిగ్ ప్లాన్!
Reading Time: < 1 minute

2027 వరల్డ్ కప్ కోసం పాక్ ప్రిపరేషన్ షురూ.. కొత్త టోర్నీతో బిగ్ ప్లాన్!

Caption of Image.

Pakistan Cricket: వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే మైండ్ గేమ్ షురూ చేసింది. ఎలాగైనా ఒక పటిష్టమైన పాక్ జట్టును రెడీ చేసేందుకు, వచ్చే ఏడాది ఆగస్టులో సరికొత్త డొమెస్టిక్ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. దేశవాళీ ఫస్ట్ క్లాస్ సీజన్ కంటే ముందే ఈ 50 ఓవర్ల టోర్నీ జరగనుందని పీసీబీ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ కన్ఫర్మ్ చేశారు.

నాలుగు జట్ల మధ్య పోరు: 

 

ఈ టోర్నీలో నాలుగు జట్లు (Quadrangular) తలపడనున్నాయి. వరల్డ్ కప్‌కు ఇంకా కేవలం 18 నెలల సమయం మాత్రమే ఉంది, కాబట్టి ప్రిపరేషన్స్ మొదలు పెట్టడానికి ఇదే రైట్ టైమ్ అని ఆకిబ్ జావేద్ తెలిపారు. పాక్ వైట్-బాల్ ప్లేయర్లు అందరూ ఇందులో ఆడటం కంపల్సరీ. సెలెక్టర్లు, కోచ్‌లు కలిసి ప్రతి ప్లేయర్‌కు ఒక నిర్దిష్టమైన రోల్ ఇచ్చి మరీ మైదానంలోకి దించనున్నారని పేర్కొన్నాడు. 
 

టాప్-4లో లేకపోతే ఒప్పుకునే ప్రసక్తి లేదు:  

 

పాకిస్తాన్‌లోని ప్రైమ్ అండ్ రైజింగ్ స్టార్స్ ఆడే ఈ టోర్నీని ఫ్యాన్స్ కోసం లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయనున్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా వరల్డ్ కప్‌కు కిరాక్ ప్లేయర్లు దొరుకుతారని పీసీబీ మేనేజ్‌మెంట్ నమ్ముతోంది. ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో పాక్ టీమ్ ఖచ్చితంగా టాప్-4 లో ఉండాలని, అంతకంటే తక్కువ వస్తే అస్సలు ఒప్పుకునేది లేదని ఆకిబ్ జావేద్ టార్గెట్ సెట్ చేశారు.

 

ఈసారి సెమీస్ బెర్తు టార్గెట్: 

 

పాకిస్తాన్ జట్టు గత 3 వన్డే ప్రపంచకప్‌లలో కనీసం సెమీఫైనల్‌కు కూడా క్వాలిఫై అవ్వలేదు.. పైగా ఇటీవలి టీ20 వరల్డ్ కప్‌లలో కూడా ఘోరంగా విఫలమవడంతో పాటు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలోనూ చివరి స్థానంలో నిలిచింది. పరువు కాపాడుకోవడానికైనా ఒక స్థిరమైన వన్డే జట్టును తయారు చేసుకోవాలని దాయాది దేశం ఆశిస్తోంది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 మధ్య జరిగే వరల్డ్ కప్‌కు ముందే ఈ టోర్నీ ముగియనుంది.
 

©️ VIL Media Pvt Ltd.