
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.42వేల జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్, జల్‌పల్లి గ్రామానికి చెందిన మేత్రి అజయ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన సంరక్షణలో ఉన్న బాలికపై నిందితుడు 2024లో అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. సాక్షాలను సేకరించిన పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా, బాధితురాలికి రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.