Reading Time: < 1 minute

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి సంబంధించిన ఫోటోలు మరోసారి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26, గురువారం రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 25, బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు.

ఈ వేడుకలో ప్రత్యేకంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహించారు. సోమవారం ఈ హల్దీ వేడుక ఫోటోలను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  హల్దీ వేడుక.. “హల్ది + హోలీ” లాగా అనిపించిందిని పేర్కొంది. విజయ్-రష్మిక హల్దీ వేడుక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.