
హైదరాబాద్: ఫలక్‌నుమా పరిధిలోని ఫరూక్‌నగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బస్ డిపో పక్కన ఉన్న దుకాణంలోప ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనున్న ఫర్నీచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే పక్కనే ఇండేన్ గ్యాస్ గోదాం ఉండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.