
ఇండియన్ ప్రీమియర్ లీలగ్-2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. గత సీజన్‌లో అద్భుతంగా రాణించి తొలిసారిగా ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఈ ఏడాది కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబద్‌తో తలడేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఇన్ని సీజన్లుగా ఆర్‌సిబిలోనే కొనసాగుతూ వచ్చిన విరాట్ కోహ్లీ.. ఆర్సిబిలో తన ఆల్‌టైమ్ ఫేవరేట్ ప్లేయింగ్ లెవన్ ఏంటనే విషయాన్ని వెల్లడించాడు.
ఆర్‌సిబి పోస్ట్ చేసిన వీడియోలో విరాట్ మాట్లాడుతూ.. ‘‘క్రిస్ గేల్‌తో కలిసి నేను ఓపెనింగ్ చేస్తా. ఇన్నింగ్స్‌ను విధ్వంసకర రీతిలో ఆరంభించాలని కోరుకుంటా. విదేశీ క్రికెటర్లను ఆడించే వెసులుబాటు ఉంది. ఎబిడి, క్రిస్ గేల్‌తో పాటు మిచెల్ స్టార్క్‌ను తీసుకుంటా. గతంలో అతడు మా జట్టులో ఆడిన ప్లేయరే. ఇక నాలుగో ఓవర్సీస్ ఆటగాడిగా డేయిల్ స్టెయిన్‌ని తీసుకుంటా. అతడి బౌలింగ్ బాగుంటుంది. పదునైన పేస్ బౌలింగ్ ఉండాలి. అందుకే, ఈ ఇద్దరు సీమర్లకు అవకాశం ఇస్తా. మిడిలార్డర్‌లో ముఖ్యమైన నాలుగో స్థానం కెఎల్ రాహుల్‌దే. ఈ ప్లేస్‌లో ఆర్సిబి తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. రజత్ పాటిదర్‌ను ఐదో స్థానంలో ఆడిస్తా. స్పిన్‌ను మెరుగ్గా ఆడగలడు. ఆరో ప్లేస్‌లో దినేశ్ కార్తీక్ ఫినిషర్. స్పిన్నర్లుగా చాహల్, కుంబ్లేను తీసుకుంటా. మూడో పేసర్ కమ్ బ్యాటర్‌గా హర్షల్ పటేల్‌కు అవకాశం ఇస్తా’’ అని అన్నాడు.