
తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. . పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం సోమవారం చెప్పింది.
రాష్ట్రంలో వానలు పడే చాన్స్ ఉండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, నిన్న పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. కాగా..వంట కోతకు వచ్చే సమయంలో వర్షాలు పడే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.