Reading Time: < 1 minute

హైదరాబాద్: హిట్లర్ కు పట్టిన గతే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పడుతుందని సిపిఐ నేత, మాజీ ఎంఎల్ఎ చాడ వెంకట్ రెడ్డి విమర్శంచారు. దేశ ప్రజలపై భారం మోపితే ప్రధాని నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు కరీంనగర్ లో చాడ నిరసన తెలిపారు.  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పెట్రోల్, వంట గ్యాస్ కొరత సృష్టించాలని చూస్తుందని దుయ్యబట్టారు. కార్పోరేట్, పెట్టుబడిదారులకు లాభం చేయాలని చూస్తే ప్రజలు తిరగబడక తప్పదని ధ్వజమెత్తారు. 

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబుల దాడులను నిరసన తెలుపుతున్నామని కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల మూలంగా వంటగ్యాస్ ధరల పెరుగుదల, గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టామన్నారు. కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో వినూతనంగా కట్టెల పొయ్యితో అలాగే సిలిండర్లను తలపై ఎత్తుకొని నిరసన తెలపడం జరిగింది.