
రాజమండ్రి: 2024లో తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఓ మహిళపై సామూహిక హత్యాచారం కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నలుగురు నిందితుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళ నర్సరీలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. నిందుతులు ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ కేసుపై పలు దశల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.